Govt Schemes : తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా కేసీఆర్ బొమ్మలతో వచ్చిన సంక్షేమ పథకాల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి బొమ్మ వస్తోంది. ఏపీలో ఐదేళ్ల తర్వాత తిరిగి తెలుగుదేశం అధికారం కైవసం చేసుకుంది. జనసేన, బీజేపీతో పొత్తుతో కూటమి ఘన విజయం అందుకుంది. ప్రభుత్వం మారడంతో పథకాల పేర్లు మరోసారి మారబోతున్నాయి. ఇన్ని రోజులు రాజన్న, వైఎస్‌ఆర్ పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేశాడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..
వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్‌ఆర్ ఆసరా, వైఎస్‌ఆర్ చేయూత.. ఇలా ప్రతీ పథకం ముందు జగన్, తండ్రి పేరును తగిలించుకుంటూ పోయాడు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా దాదాపు ఇదే పథకాలను అమలు చేయనుంది. ఇచ్చేది అదే డబ్బు, చేసే ఖర్చు ప్రజల ఖజానాలోదే.. కానీ పేరు మాత్రం మళ్లీ మారనుంది.
News Channels : అభివృద్ధికి ఆటంకం! ఏపీలో Tv9, Ntv, 10tv, సాక్షి టీవీలపై బ్యాన్..
ఇకపై ఆ పేర్లు కూడా మారబోతున్నాయి. ఇది కేవలం రేషన్ బియ్యం, నెలకోసారి ఇచ్చే ఫించన్‌తో మాత్రమే ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన యూనివర్సిటీకి తొలుత ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది అప్పటి ప్రభుత్వం. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆ పేరును తొలగించి వైఎస్‌ఆర్ యూనివర్సిటీ అని మార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టించిన ఎన్టీఆర్ విగ్రహాలు, ప్రాజెక్టుల శిలఫలకాలు అన్నీ కూల్చారు. ఆ స్థానంలో వైఎస్‌ఆర్ విగ్రహాలు, వైసీపీ ప్రభుత్వ శిలఫలకాలు పెట్టుకున్నారు..
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే వైఎస్‌ఆర్ విగ్రహాలు కూలగొడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రాజకీయాలు తిరుగుతున్నది మాత్రం విగ్రహాల చుట్టూ, పేర్ల చుట్టే! ప్రజలకు మంచి చేయడం కంటే, మేం చేశాం, మా పేరు గుర్తుండిపోవాలనే ఆరాటమే జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కాలేజీ ఫీజు కట్టడానికి పైసా లేకపోయినా, అప్పు చేసి ఫ్లెక్సీల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే కుర్రాళ్లు.. ఈ విగ్రహాల రాజకీయాలకు వారసులుగా మారుతున్నారు.