Brother Anil – YS Jagan :వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య వైరం, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అన్నను అధికారంలోకి దించేందుకు స్వయంగా చెల్లెలే, ప్రతిపక్షంలో చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఈ విషయం గురించి మాట్లాడాడు..
‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవ్వర్ని పట్టించుకోలేదు. పూర్తిగా దూరం పెట్టేశారు. ఆయన ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, కుటుంబం కోసం ఓ 10 నిమిషాలు కేటాయించలేరా?
జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందులో షర్మిల పాత్ర కూడా చాలా ఉంది..
అయితే ఆ తర్వాత జగన్‌లో చాలా మార్పు వచ్చింది. మేం ఎప్పుడూ అధికారం అడగలేదు, పదవులు అడగలేదు, ఆస్తులు అడగలేదు. వాళ్ల కంపెనీలు చూడండి, మా కంపెనీలు చూడండి.
సాక్షిలో షర్మిలకు కూడా వాటా ఉంది. అన్నయ్య, సాక్షి నేను వాడుకుంటానని అడిగింది. అది కేసుల్లో ఉంది, ఎలా ఇస్తామని చెప్పారు. ఆయన మాత్రం వాడుకుంటున్నాడు.
ప్రజలేం పిచ్చోళ్లు కాదు. అందరికీ తెలివి ఉంది, ఏం జరుగుతుందో తెలుసు.. ఆయన చేసింది తప్పు అని నాకు మాట్లాడడం ఇష్టం లేదు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ పార్టీకి తగ్గట్టుగా మాట్లాడుతుంది.
అంతేకానీ వ్యక్తిగతంగా ఎలాంటి పగలు, ప్రతీకారాలు లేవు.. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ వదిలేశాం.. దేవుడు అన్నీ చూస్తున్నాడు… దేవుడు పేరు చెప్పి, పాడు పనులు చేయడం కరెక్ట్ కాదు..’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రదర్ అనిల్..
జగనన్న వేరు, సీఎం జగన్ వేరు! మా అన్నను మిస్ అవుతున్నా..