Radiation : ముందుగా రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం..
గాలి వీచని రాత్రి బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురును “రేడియేషన్” కి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ఉష్ణ ప్రసరణకి మూడు మార్గాలు ఉంటాయని సైన్స్ స్టూడెంట్స్ చదివే ఉంటారు. ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్స్ కాకపోయినా నో ప్రాబ్లెమ్ . .
అవేంటంటే..
కండక్షన్ (conduction),
కన్వెక్షన్ (convection),
రేడియేషన్ (radiation).
కండక్షన్ : అంటే ఒక ఘన పదార్థం వేడి ప్రయాణించడానికి మాధ్యమంగా (Mediator) ఉండాలి.
Example : ఐరన్ బాక్స్ లో ఉండే వేడి మనం ఐరన్ చేసే చొక్కకి ప్రసరించడం.
Stove వెలిగించినప్పుడు stove నుండి వెలువడే మంట.
కన్వెక్షన్ : అంటే ద్రవ పదార్థం కాని, వాయు పదార్థం కాని ఉష్ణ ప్రసరణకి మాధ్యమంగా ఉంటుంది.
Example: ఏసీలు, Refridgerator లాంటివి.
Weight Loss Diet : ఆరోగ్యంగా ఇలా బరువు తగ్గుదాం..
ఈ మాధ్యమాల ప్రసక్తి లేకుండా అంటే.. ఘన పదార్థం గానీ, వాయు పదార్థం కానీ లేకుండా ప్రయాణం చేస్తే అది రేడియేషన్.
ఉదాహరణకు: సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు, X Rays, వైఫై రూటర్ నుంచి వెలువడే Microwave Radiations లాంటివి.
రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు రూపంలో ఉండవచ్చు.
కంటికి కనిపించని వేడి రూపంలోను ఉండవచ్చు,
విశ్వమంతా శక్తిమయం కనుక ఈ విశ్వంలో రేడియేషన్ లేని ప్రదేశం లేదని చెప్పవచ్చు.
ఇప్పుడు సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్స్ గురించి తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మన జీవన శైలిలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు.
అయితే సెల్ ఫోనుల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమాన పడుతుంటే, కేన్సరు వచ్చే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి హెచ్చరికలలో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలంటే.. కొంచెం లోతుగా పరిశీలించాలి.
మన జీవితాన్ని.. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అని వివిధ రకాలుగా విడగొట్టినా మనం అంతా మనుష్యులమే కదా.. వయస్సులో తేడా, అంతే!.
అలాగే రేడియో తరంగాలన్నా, సూక్ష్మ తరంగాలన్నా, పరారుణ తరంగాలన్నా, కాంతి తరంగాలన్నా, అతినీలలోహిత తరంగాలన్నా, X-కిరణాలు అన్నా, గామా కిరణాలన్నా – ఇవన్నీ పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా ఈ ‘తరంగాల పొడుగు’ (wavelength) ని బట్టి మారుతూ ఉంటుంది.
Tips For Rainy Season : తొలకరి చినుకుల వేళ..
రేడియో తరంగాలు పొడుగ్గా ఉంటాయి. అందులో మళ్ళీ AM రేడియో తరంగాలు ఇంకా పొడుగు,
FM రేడియో తరంగాలు మరి కాస్త పొట్టి, TV తరంగాలు కొంచెం పొట్టి,
సెల్ ఫోను తరంగాలు ఇంకా పొట్టి, ఎక్స్-కిరణాలు మరికొంచెం పొట్టి, గామా కిరణాలు చాలా పొట్టి.
అవసరాన్ని బట్టి వీటిని విడివిడిగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు లేకపోతే వీటన్నిటినీ కట్టగట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అంటే సరిపోతుంది.
“పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు” అన్నట్లు తరంగం పొట్టిగా ఉంటే దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. ఎంత శక్తిమంతమైనవి అంటే అవి మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది.
ఎక్స్-కిరణాలు కూడా శక్తివంతమైనవే. అందుకనే వైద్యుడు ఎక్స్-రే ఫొటోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంకా పొడుగైన తరంగాలు అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటికి కనబడవు కాని, మనం బయటకి ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం “కాలి” కమిలి పోతుంది.
వీటికంటే పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడటం మొదలుపెట్టి దాదాపు ఒక శతాబ్దం అవుతోంది. వీటివల్ల ఆరోగ్యానికి హాని కలిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. దీన్నిబట్టి అన్ని “విద్యుదయస్కాంత తరంగాలు” (Electromagnetic waves) ఆరోగ్యానికి హాని చెయ్యవు.
శక్తిమంతమైన తరంగాలే ప్రమాదం. ఈ శక్తిమంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు ఎక్కువ ప్రమాదం.
గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాల తాకిడి వల్ల కేన్సరు వంటి వ్యాధులు వస్తాయనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ సెల్ ఫోన్ రేడియేషన్స్ వలన క్యాన్సర్ వస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
ఎక్స్-కిరణాల వలన హాని కలుగుతుంది అని తెలిసినా వాడటం మానేస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుక ఎండలోకి వెళ్లినప్పుడు Body కి Lotions రాసుకోవడం, Cooling Glasses పెట్టుకోవటం వంటివి చేస్తుంటాం.
Dangerous Media: ఈ మీడియాలతో ప్రమాదం..
సెల్ ఫోన్ ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ప్రమాదం లేకపోయినా, సెల్ ఫోనుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటే హెడ్ సెట్ పెట్టుకొని మాట్లాడడం బెటర్.
* తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి.
* అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి.
* Night Time phone ఎక్కువగా ఉపయోగించకూడదు.
*సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని 24 గంటలు అదే పనిగా వాడకూడదు.
సెల్‌ఫోన్ వాడకూడని ప్రదేశాలు..
* లౌడ్స్పీకర్లు, రేడియోలు ఉన్నచోట సెల్‌ఫోనును ఉపయోగించేప్పుడు “గరగర’ శబ్దాలు రావడాన్ని మీరు గమనించే ఉంటారు.
ఇందుకు కారణం సెల్‌ఫోన్‌కు చేరే విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోలలో ఉన్న సున్నితమైన విద్యుత్ వలయాలు కృత్రిమంగా విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించడమే.
దీనిని ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ అంటారు. ఈ సూత్రం ఆధారంగానే ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, జనరేటర్లు పనిచేస్తుంటాయి.
* పెట్రోలు బంకుల దగ్గర మనం సెల్‌ఫోన్ వాడేటప్పుడు సున్నితమైన విద్యుత్ పరికరాల్లో కూడా విద్యుత్ ప్రేరణ జరిగే అవకాశం ఉంది. వీటికి ఓ దశ, దిశ పద్ధతి లేకపోవడం వల్ల విద్యుత్ సర్క్యూట్‌తో స్పార్కులు రావచ్చు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నమాట. అందువల్లే పెట్రోల్‌పంపుల దగ్గర సెల్ఫోన్లు వాడకూడదు.