News Channels : తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌పై బ్యాన్ వేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం అందుకుని అధికారంలోకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు వైసీపీ పార్టీకి కొమ్ముకాస్తూ, అండగా నిలిచిన నాలుగు న్యూస్ ఛానెళ్లపై బ్యాన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్లు..
Narendra Modi : మూడోసారి మోడీకి పట్టాభిషేకం.. చంద్రబాబు డిమాండ్స్ ఏంటంటే..
జగన్ సొంత టీవీ ఛానెల్ సాక్షి టీవీతో పాటు టీవీ 9, N Tv, 10 Tv ఛానెళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసారం చేయబోమంటూ నిర్ణయం వెల్లడించారు ఏపీ కేబుల్ ఆపరేటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియచేశారు..
అయితే డిష్ టీవీ, టాటా స్కై వంటి ఆపరేటర్లు వాడేవారికి మాత్రం ఈ ఛానెళ్లు అందుబాటులో ఉండొచ్చు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఒక్క రోజులోనే సాక్షి దిన పత్రిక సర్కూలేషన్ 12 లక్షలు తగ్గిపోయింది. ఇది పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను హరించడమేనని వైసీపీ వాదిస్తోంది. అయితే ఈ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఇది జనాలు, కేబుల్ ఆపరేటర్లు కలిసి తీసుకున్న నిర్ణయం మాత్రమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నారు.