Dosakaya Pachi Nethallu : దోసకాయ అనగానే చాలామందికి ఇష్టం ఉండదు. చాలా తక్కువ మంది వండినా ఏ పప్పులోనూ లేదంటే ఏ పచ్చడినో చేస్తారు తప్పా.. దోసకాయతో ఎక్కువగా ఎలాంటి కూరలు చేయరు. నిజానికి దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దోసకాయలో వాటర్ కంటెంట్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు రొయ్య దోసకాయ, పచ్చి రొయ్యలు దోసకాయ, ఎండు నెత్తల్లు, ఎండు చాపలతో దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ దోసకాయ ఎందులోకైనా కలగలిపినా కూరలోకి రుచిగా ఉంటుంది. ఈ రోజు మనం పచ్చి నెత్తల్లు దోసకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
* దోసకాయ ముక్కలు ఒక కప్పు
* శుభ్రం చేసిన పచ్చి మెత్తళ్లు 3 కప్పులు (మీ ఇష్టాన్ని బట్టి కొలతలు మార్చుకోవచ్చు)
* కరివేపాకు 2 రెమ్మలు
* ఉల్లి తరుగు కప్పు
* పచ్చి మిర్చి – 6
* ధనియాల పొడి – టీ స్పూను
* అల్లం వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూన్
* ఉప్పు – సరిపడ
* పసుపు – తగినంత
* కారం – రెండు టీ స్పూన్లు
* నూనె – తగినంత
* ఆవాలు – టీ స్పూను
* జీలకర్ర – టీ స్పూను
తయారీ విధానం :
బాణాలిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పసుపు, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ఆ తర్వాత తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న నెత్తళ్లు వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, తగినన్ని నీళ్లు పోసి మూత ఉంచాలి. బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి అంతే.. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.