Jonna Ravva Payasam : ఇటీవల కాలంలో నాచురల్ పదార్థాలని చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో జొన్నలు ఒకటి. ఇవి శరీరానికి తక్షణమే శక్తినివ్వడంతో పాటు.. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తాయి.
జొన్నలతో వివిధ రకాలైన రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. అందులో జొన్నరవ్వ పాయసం రుచితో పాటు బలాన్నిస్తుంది. దీన్ని పాయసం కంటే అటుకుల రవ్వ పాయసం కంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
Fried Banana : అద్భుతమైన అరటికాయ 65
కావాల్సిన పదార్థాలు :
* తెల్ల జొన్నలు కొంచెం బరకగా మర పట్టించుకోవాలి (జొన్నరవ్వ)
* బెల్లం తురుము (రుచికి సరిపడ)
* ఉప్పు చిటికెడు (రుచికోసం)
* నెయ్యి తగినంత
* యాలుకులపొడి (ఫ్లేవర్ కోసం)
* నెయ్యి లో వేయించుకున్న జీడిపప్పు, కిస్ మిస్ లు
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు కొంచెం ఎక్కవగా పోసుకుని, అందులో యాలుకలపొడి, నెయ్యి వేసుకుని నీళ్ళు వేడవ్వగానే జొన్నరవ్వ వేసుకోవాలి. అది ఉడికిందో, లేదో చూసుకుని బాగా ఉడికిన తర్వాత.. మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం తురుము అందులో వేసుకోవాలి. బాగా దగ్గరగా అవుతుంది అనుకున్నప్పుడు తీపి రుచి చూసుకోవాలి. కొంత చిక్కగా అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్ మిస్ లు వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే.. ఘుమఘుమలాడే రుచికరమైన జొన్నరవ్వతో పాయసం రెడీ..