Kothimeera Pachadi : ఆ కొత్తిమీరలో ఏముంది లేండి అనుకోకండి. కొత్తిమీరలో ఎన్నో ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. కొత్తిమీర చిగుళ్ళు మరియు దంతాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు రెగ్యులర్ గా కొత్తిమీరని మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. బీపీ డయాబెటిస్ వ్యాధులు ఉన్నవాళ్లు కూడా ఈ కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తిమీరని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఇన్ని ఉపయోగాలున్న కొత్తిమీరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
* కొత్తిమీర – రెండు చిన్న కట్టలు (క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి)
* పచ్చిమిర్చి – 8 నుంచి 10 (కారానికి సరిపడా)
* చింతపండు – నిమ్మ కాయంత (కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి)
* పసుపు – చిటికెడు
* ఉప్పు – రుచికి తగినంత
* బెల్లం – చిన్న ముక్క (20గ్రా.)
తాలింపు కోసం..
* నూనె – 5 స్పూన్లు
* ఎండుమిరపకాయలు – 5
* మినపప్పు – స్పూను
* మెంతులు – 1/4 స్పూను
* ఇంగువ – చిటికెడు
* ఆవాలు – 1/4 స్పూన్లు
Red Capsicum Chutney: రెడ్ క్యాప్సికమ్ రోటి పచ్చడి..
తయారీ విధానం :
స్టౌ మీద కడాయి పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే.. వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేయాలి. పోపు వేగగానే పచ్చిమిరపకాయలు అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 5 నిముషాలు మగ్గనివ్వాలి.
వేగించిన పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, చింతపండు (నీళ్ళతో కలిపి ) అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. తర్వాత చిన్నబెల్లం ముక్క , వేగించిన పచ్చిమిర్చి , మిగిలిన పోపు మరియు శుభ్రం చేసిన కొత్తిమీరను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సింపుల్ గా కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ కొత్తిమీర పచ్చడి ఇడ్లీ, దోశె, చపాతీ అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.