YouTuber Praneeth Hanumantu : రూల్స్ మారాయి, రాతలు జాగ్రత్త! ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే అంతే..

YouTuber Praneeth Hanumantu
YouTuber Praneeth Hanumantu

YouTuber Praneeth Hanumantu : సోషల్ మీడియా యుగంలో వాక్ స్వాతంత్య్రానికి రెక్కలు వచ్చాయి. ఎవరికి తోచింది వాళ్లు, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాని మంచి కోసం వాడేవారి కంటే ఇలా తమ నోటి దురుసుని చూపించడానికి వాడుకునేవాళ్లే ఎక్కువ.. సోషల్ మీడియాలో బూతులు పెట్టేవాళ్లు, వేరే పోస్టులపై బూతులు కామెంట్లు చేసేవాళ్లే ఎక్కువ. ఇలాంటి వారికి ఇకపై సీరియస్‌ యాక్షన్ తీసుకోనుంది ప్రభుత్వం..

ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్, లైవ్‌లో తన స్నేహితులతో కలిసి ఓ ఇన్‌స్టా రీల్ గురించి చేసిన కామెంట్లు, సోషల్ మీడియాని కుదిపేశాయి. నాలుగేళ్ల చిన్నారితో తండ్రి ఆడుకుంటున్న వీడియోని అసభ్యంగా మలిచి, పిచ్చి జోకులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి… పిల్లలపై లైంగిక వ్యాఖ్యలు చేసిన వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరడంతో ఇష్యూ పెద్దది అయ్యింది..

హద్దుల్లేని ప్రేమ.. ఆమె కోసం అతడిగా మారి.. చివరకు విషాదాంతమై..

రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో హీరో మంచు మనోజ్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అమ్మ తోడు.. నిన్ను వదలా’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. టాలీవుడ్ హీరో అడివి శేషు కూడా దీనిపై సీరియస్ అయ్యాడు. హనుమంతుతో పాటు యూట్యూబ్ లైవ్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులపై కేసు నమోదైంది. తనను క్షమించాలంటూ అతను మరో వీడియో షేర్ చేశాడు..

సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేసేవారిపై కూడా ఓ కన్ను వేస్తోంది సైబర్ క్రైమ్ టీమ్. సోషల్ మీడియాలో ఆడవాళ్లను కించపరిచేలా కామెంట్లు చేసేవారిపై, బూతులు తిట్టేవారిపై నిఘా పెట్టనుంది… హద్దు దాటారని తెలిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా రూల్స్ రూపొందిస్తున్నారు… కాబట్టి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు వాడే వాళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకుంటే బెటర్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post