Tamil Nadu Women : నిత్య పెళ్లి కొడుకు అనే వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఈ వార్త నిత్య పెళ్లి కూతురు గురించి.. ఎలాంటి నెట్వర్క్ లేకుండా తన అందాన్ని అస్త్రంగా చేసుకుని, ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుందో యువతి. పోలీసులను కూడా అవాక్కయ్యేలా చేసిన ఈ సంఘటనలో సదరు అందాల రాశి చేతుల్లో మోసపోయిన వారిలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉండడం విశేషం..
తమిళనాడులోని తిరుపూర్ ఏరియాకి చెందిన ఓ 35 ఏళ్ల యువకుడు, పెళ్లి కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఎంతకీ పెళ్లి కాకపోవడంతో ఓ వెబ్సైట్లో సంధ్య అనే అమ్మాయితో పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకున్నాడు. మొదటి 3 నెలలు కాపురం సజావుగానే సాగింది. ఆలస్యమైనా, హీరోయిన్లాంటి అందాల రాశి తనకు భార్యగా వచ్చిందని మురిసిపోయాడు.
Beautiful Female Cricketers : ప్రపంచంలోనే అందమైన మహిళా క్రికెటర్లు వీరే..
అయితే మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాత్రిపూట బ్యాగులు సర్దుకుని, పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా గమినించాడు. ఎక్కడికని అడిగితే ఏడిచి, గగ్గోలు పెట్టేది. అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రుల గురించి విచారించాడు. ఏమీ తెలియలేదు. అసలు ఆమె, పెళ్లికి ముందు ఎక్కడ ఉండేది? ఏం చేసేది? అని తెలుసుకోవాలని ఆధార్ కార్డు చెక్ చేశాడు..
అందులో అప్పటికే ఆమెకి పెళ్లైనట్టు ఉండడంతో షాక్ అయ్యాడు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే, గృహ హింస కేసు పెడతానని బెదిరించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా ఆమెకి అప్పటికే 50 సార్లు పెళ్లి అయ్యిందని తేలింది.
Women in Assembly : మహిళలు.. ఆకాశంలో సగం, అసెంబ్లీలో మాత్రం..
ఆమె అందానికి ముగ్దులై, ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయిన వారిలో ఓ డీఎస్పీ, మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని తేలింది. పెళ్లి తర్వాత కొద్దిరోజులు వారితో ఉండి, వారి దగ్గరున్న డబ్బు, నగలతో పారిపోయేదని తేలింది. ఇంత జరుగుతున్నా సంధ్యపైన ఇప్పటిదాకా ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదనేది అర్థం కాని విషయం..