Revanth Reddy : నారా చంద్రబాబునాయుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత ఓటుకి నోటు కేసులోఅరెస్టు అయిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2023 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది కాంగ్రెస్‌కి బాగా అనుకూలించింది.
టీడీపీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కి దక్కడంతో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కావడానికి సాయపడింది. తాజాగా ప్రెస్ మీట్‌కి హాజరైన రేవంత్ రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురైంది.
Rohit Vemula Death Case : ఆత్మ‘హత్యా’ రాజకీయం.. రోహిత్ వేముల కేసు కొట్టేసి, మళ్లీ రీ-ఓపెన్..
‘శిష్యుడి కోసం తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయకుండా విరమించుకున్నారు. ఇప్పుడు గురువుగారు అక్కడ పోటీ చేయబోతున్నారు. మరి ఈ శిష్యుడి సహకారం, గురువుకు ఉంటుందా?’ అంటూ ప్రశ్నించాడు ఓ రిపోర్టర్.. ఈ ప్రశ్నపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు.
‘ఎవడయ్యా, బుర్రలేనోడు మాట్లాడేది.. ఎవరు శిష్యుడు? ఎవరు గురువు? నేను చంద్రబాబు గారికి సహచరుడిని మాత్రమే. ఎవరైనా బుద్ధిలేని గాడి ఇలా శిష్యుడు, గురువు అని మాట్లాడితే తంతాను.. చంద్రబాబు గారు, టీడీపీ అధ్యక్షుడు. నేను ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ పార్టీలోకి వెళ్లాను. నేను ఆయనకు సహచరుడిని మాత్రమే..’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..