Sai Dharam Tej New Name : హిట్లు తక్కువగా, క్రేజ్ తక్కువైనా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ, అభిమానులతో ఈజీగా కలిసిపోయే సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ మూవీతో మంచి సూపర్ హిట్టు కొట్టాడు. పవన్‌తో చేసిన ‘బ్రో’ లాభాలు తేకపోయినా, నటుడిగా తేజూని మరో మెట్టు ఎక్కించింది..
Pushpa 2 : బన్నీ – సుక్కు కాంబోకి దిమ్మతిరిగే ఆఫర్..
తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లికి విభిన్నంగా విష్ చేశాడు తేజూ. ఇకపై తన పేరు సాయి ధరమ్ తేజ్ కాకుండా సాయి దుర్గ తేజ్‌గా మార్చుకుంటున్నట్టుగా ప్రకటించాడు. తల్లి దుర్గ పేరును తన పేరులో కలుపేసుకున్నాడు తేజూ. అలాగే తల్లి పేరు మీద విజయ దుర్గా ప్రొడక్షన్స్ పేరుతో సరికొత్త బ్యానర్‌ని కూడా మొదలెట్టాడు తేజూ..
మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలతో తన బ్యానర్ మీద మంచి సినిమాలు నిర్మించబోతున్నట్టు ప్రకటించాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదం బారిన పడి, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న సాయి దుర్గ తేజ్, ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. బడ్జెట్ కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి.. అలాగే టైటిల్లో ఉన్న ‘గాంజా’ పేరును తొలగించాలని తెలంగాణ నారోటిక్స్ బ్యూరీ చిత్ర యూనిట్‌కి నోటీసులు జారీ చేసింది.
SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..