AP Exit Polls : 2024 ఎలక్షన్స్‌కి సంబంధించి ఎగ్జిట్స్ పోల్స్ వచ్చాయి. చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా టీడీపీ+జనసేన+ బీజేపీ కూటమి, ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్టుగా ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిల్లో తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 110 సీట్లు రాబోతున్నాయి. జనసేన పార్టీ 14 నుంచి 20 స్థానాల్లో చేజిక్కించుబోతుంటే, భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే నివేదిక తేల్చింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 60 స్థానాల లోపే సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి..
Brother Anil – YS Jagan : జగన్ జైలులో ఉంటే షర్మిల పాదయాత్ర చేసింది! అధికారం రాగానే దూరం పెట్టారు..
సీఎన్ఎన్ న్యూస్18 ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి 19 నుంచి 22 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంటే, వైసీపీకి 5 నుంచి 8 లోక్‌సభ స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది. ఆత్మ సాక్షి మాత్రం ఈసారి కూడా ఆంధ్రాలో వైసీపీదే అధికారమని పేర్కొంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోబోతుంటే, టీడీపీ కూటమి 59 నుంచి 77 స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చింది ఆత్మసాక్షి. అలాగే ఎంపీ స్థానాల్లోనూ వైసీపీకి 16-17 సీట్లు దక్కితే, టీడీకి 8-9 స్థానాలే దక్కుతాయని చెప్పింది..
అయితే తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అన్ని సర్వేలు ఒకే విధమైన నివేదిక ఇచ్చాయి. బీజేపీ ఈసారి తెలంగాణలో 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు దక్కించుకోబోతుంటే కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. భారత రాష్ట్ర సమితికి ఒకే ఒక్క ఎంపీ సీటు దక్కబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ సారాంశం. ఇదే నిజమైతే 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి ఇది చావు దెబ్బే..