KCR – YS Jagan : టైం బాగోలేనప్పుడు ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర ఓటమి చవి చూసింది భారత రాష్ట్ర సమితి. అయితే ఈ ఓటమి తర్వాత కూడా కేసీఆర్‌లో కానీ, భారత రాష్ట్ర సమితి వైఖరిలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు అందుకున్న సమయంలోనే, అటు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో ప్రతీ ఏడాది ఇద్దరు ముఖ్యమంత్రుల పనితీరును పోలుస్తూ వార్తలు వచ్చేవి. దీంతో దీనికి అంతం పలకాలనే ఉద్దేశంతోనే 2019లో 6 నెలల ముందే ముందస్తు ఎన్నికలు నిర్వహించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డిని కలిసిన కేటీఆర్, తమ సపోర్ట్ తెలిపాడు. టీడీపీ ఉన్నప్పుడు ఇలాంటి స్నేహం ఎందుకు లేదు? చాలామందికి ఇది అర్థం కాని విషయం. అదీకాకుండా 2019లో చంద్రబాబు ఓటమిపై ‘జనాలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు కేసీఆర్. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి రాగానే తనకు ఇక తిరుగులేదని అనుకుని, కేంద్ర రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించాలని అనుకున్నారు..
తెలంగాణ రాష్ట్ర సమితిని, ‘భారత రాష్ట్ర సమితి’గా మారుస్తూ, ఢిల్లీలో పెద్ద ఆఫీసు తెరిచాడు. అయితే రాష్ట్రంలో చక్రం తిప్పినంత ఈజీ కాదు, కేంద్రంలో రాజకీయాలు సాగించడం.. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ పొజిషన్ ఏం బాగోలేదు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత అరెస్టుపై పెద్ద దెబ్బ తగిలింది. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ.
అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో సీట్లు తెచ్చుకున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఘోర పరాభవం తప్పేలా లేదు. మరోవైపు పొరుగు రాష్ట్రంలో జగన్ ఓటమి కూడా దాదాపు ఖాయమైపోయింది. మళ్లీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని వైసీపీ నాయకులు చెబుతున్నా, అక్కడ ఆ పార్టీకి భారీ ఓటమి తప్పదని వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి, కొసరు కేంద్రంపై కన్నేసిన కేసీఆర్‌కి అసలుకే ఎసరు పడేలా ఉందని అంటున్నారు పొలిటికల్ అనాలసిస్‌లు..