Gutti Vankaya Kura : గుత్తి వంకాయ కూర.. ఆహా ఈ పేరు వినగానే నోట్లోకి నీళ్ళూరుతున్నాయి కదూ.. ఆ రుచి అలాంటిది మరి, ఈ రోజు చాలా సింపుల్ ప్రాసెస్ లో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
* వంకాయలు అరకేజీ
* ఆయిల్ (ఎక్కువే పడుతుంది)
* కరివేపాకు రెండు రెమ్మలు
* ఉప్పు (రుచికి సరిపడ)
* ధనియాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
* లవంగ మొగ్గలు రెండు, చిన్న చెక్క ముక్క
* గసగసాలు ఒక టేబుల్ స్పూన్
* నానబెట్టిన వేరుశనగ గింజలు ఒక టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ (పెద్దది)
* టమాట
* అల్లం 2 అంగుళాల మొక్క వెల్లుల్లి ఐదారు రెమ్మలు
* పసుపు చిటికెడు
* కారం ఒక టేబుల్ స్పూన్
* కొత్తిమీర
Hyderabadi Dum Biryani : వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
తయారీ విధానం..
ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క ముక్క, ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన గసగసాలు ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన పల్లీలు, ఉల్లిపాయ, టమాట, వెల్లుల్లి రెమ్మలు, అల్లం ముక్క, ఉప్పు, కారం, పసుపు, అలాగే పైన ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులు అన్ని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
వంకాయల్ని శుభ్రంగా కడిగి, ఉప్పు, పసుపు వేసిన నీటిలో ఒక్కో వంకాయని అడ్డంగానీ, అటుఇటు నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేసిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ అవ్వనివ్వాలి.ఆ తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం జీలకర్ర వేసి, మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో పెట్టి మూత పెట్టాలి.
ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. వంకాయలు వేసిన వెంటనే కదపకూడదు. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయల్ని మరొకవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలో పెట్టగా మిగిలిన స్టఫ్ ని ఆ వంకాయల మీద వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి, ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే ఆహా.. ఇంకా ఆ రుచి మాటల్లో చెప్పలేం..