Egg Masala : రోజూ కాయగూరలతో, ఆకుకూరలతో కాలక్షేపం చేసిన వారికి.. ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే, ముద్ద దిగదు. సండే చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ లేకపోయినా కనీసం గుడ్డు అయినా ఉండాల్సిందేనండోయ్.. లేకపోతే కడుపులో నిండుతుందో చెప్పండే.. ఈ రోజు ఘాటైన గుడ్డు మసాలా ఎలా చేయాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
* ఉడకబెట్టిన కోడిగుడ్లు 4
* ఉల్లిపాయలు 4 సన్నగా కట్ చేసుకోవాలి
* పచ్చిమిర్చి 4 చీలికలు
* కరివేపాకు 2 రెమ్మలు
* కారం రెండు టేబుల్ స్పూన్లు
* ఉప్పు సరిపడినంత
* పసుపు చిటికెడు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్..
* నూనె వేయించడానికి సరిపడినంత
Hyderabadi Dum Biryani : వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
ముందే చెప్పా కదండీ ఇది ఘాటైన గుడ్డు మసాలా అని.. అందుకే ఇప్పుడు ఇందులో వేయాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం..
జీలకర్ర, ధనియాలు కలిపి టేబుల్ స్పూన్.. లవంగాలు 4, చిన్న దాల్చిన చెక్క, యాలకులు 2, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
తయారీ విధానం..
కొంచెం మందగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా అలాగే రెండు స్పూన్ల కారం సరిపడినంత ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లని గాట్లు పెట్టుకొని ఆ మసాలాలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని దింపుకుంటే సరిపోతుంది. దీన్ని పప్పుచారులో నంజుకుని తింటుంటే ఉంటుందండీ.. దీని ముందు చికెన్, మటన్ కూడా బలాదూర్ అండీ..