YV Subba Reddy : ఇప్పట్లో రాజధాని కట్టే పరిస్థితి లేదు! అంతవరకూ హైదరాబాదే గతి..

YV Subba Reddy : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ కొత్త రాజధానిని నిర్మించలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసేందుకు భారీగా ఖర్చు చేసింది. అయితే టీడీపీ మొదలెట్టిన రాజధానిని తాము ఎందుకు పూర్తి చేయాలని అనుకున్న వైసీపీ ప్రభుత్వం, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అయితే చర్చలతోనే ఐదేళ్లు గడిచిపోయాయి కానీ రాజధాని మాత్రం ఏర్పాటు కాలేదు..

Harish Shankar Fire on Websites : సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్..

వైజాగ్, ఏపీ రాజధాని అంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చినా, అధికారిక రాజధాని అయితే ఇంకా లేదు. కొన్నిరోజుల క్రితం ‘#90s’ వెబ్ సిరీస్ పోరడు మౌళీ, ఇదే విషయం మీద జోక్ చేశాడని అతన్ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. తాజాగా వైసీపీ నేత వై.వీ. సుబ్బారెడ్డి, రాజధాని గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు..

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజధాని నిర్మించే సత్తా, సత్తువ రెండూ లేవు. వైజాగ్‌ని ఎగ్జిక్యూటివ్ రాజధాని అయ్యేవరకూ హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని కేంద్రంపైన ఒత్తిడి పెంచుతాం..’ అంటూ వ్యాఖ్యానించాడు వై.వీ. సుబ్బారెడ్డి..

Indian Students in Abroad : కోటి ఆశలతో విదేశాలకు వెళ్లి, విగతజీవులుగా తిరిగి వస్తూ..

రాష్ట్ర విభజన తర్వాత అవసరమైతే 10 ఏళ్లు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకోవచ్చంటూ కేంద్రం సిఫార్సు చేసింది. అయితే చంద్రబాబు నాయకత్వంలోనే టీడీపీ ప్రభుత్వం, కొత్త సెక్రటేరియట్‌, కొత్త హైకోర్టు ఇలా అమరావతిలో రాజధాని కోసం అనేక నిర్మాణాలు మొదలెట్టింది. అయితే రెండోసారి ఎలక్షన్లలో ఆ పార్టీ ఓడిపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌ని మళ్లీ ఉమ్మడి రాజధానిగా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తేస్తే, చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోసం ఆగాల్సిందే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post