Indore Beggar : కష్టపడేవాడికి ఒకటే కూర, అడ్డుకునేవాడికి అరవై కూరలు.. తెలుగులో పాత సామెత ఇది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడి, ఒళ్లు హునం చేసుకునే కూలీలను రోజుకి రూ.1000 కూడా గిట్టడం లేదు. అలాంటిది ఓ బిచ్చగత్తె 40 రోజుల్లో అడుక్కుంటూ రూ.2.5 లక్షలు సంపాదించేసిందట.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..
Sembi Movie : చట్టాలు మార్చలేని ఛిద్రమైన బతుకు కథ..
ఇండోర్‌లోని లవ్ కుష్ స్క్వైర్ ఏరియాలో భిక్షాటన చేసే ఓ మహిళను, ఆమె 8 ఏళ్ల కూతురుని అధికారులను రిమాండ్‌లోకి తీసుకున్నారు. 8 ఏళ్ల కూతురితో భిక్షాటన చేయిస్తున్న తల్లిని అరెస్ట్ చేసి, కూతుర్ని చైల్డ్ కేర్ సెంటర్‌కి తరలించారు. తల్లిని విచారణ చేసిన అధికారులకు అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. గత 40 రోజుల్లో ఆమె అడుక్కుంటూ అక్షరాల 2 లక్షల 50 వేల రూపాయలు సంపాదించిందట..
అందులో ఓ లక్ష తన కుటుంబానికి పంపగా, రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట. మిగిలిన రూ.1 లక్షను విలాసాల కోసం ఖర్చు చేసిందట. ఆమె ఆస్తుల గురించి వివరాలు సేకరించగా అడుక్కునే ఆమెకి ఓ స్వంత ఇళ్లు, భారీగా స్థలం, రెండు కార్లు, పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రిడ్జ్‌లు ఉన్నట్టు తెలిసింది..
ఆమె, తన భర్త, ఇద్దరు కొడుకులు, కూతుర్లు కలిసి ఏడాది అడుక్కుంటూ రూ.20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారట. ఆమెను అరెస్ట్ చేసే సమయానికి ఆ బిచ్చగత్తె దగ్గర రూ.16 వేలు ఉన్నాయని, అవి ఆరోజు సంపాదన అని తెలిసి అవాక్కయ్యారు అధికారులు.
Harish Shankar Fire on Websites : సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్..