Tollywood Star Heroes Movie Budget : 2003లో వచ్చిన ‘సింహాద్రి’ బాక్సాఫీస్ దగ్గర రూ.35 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నాలుగేళ్లకు వచ్చిన ‘పోకిరి’ ఆ రేంజ్‌ని డబల్ చేసి రూ.70 కోట్లు వసూలు చేసింది. 2009కి వచ్చేసరికి ‘మగధీర’ రూ.150 కోట్లు వసూలు చేసింది. ‘బాహుబలి’ మూవీతో కలెక్షన్లు ఏకంగా రూ.500-1000 కోట్లకు చేరాయి.
అల్లు అరవింద్ లేకపోతే, చిరంజీవికి నా పరిస్థితే వచ్చేది! చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్..
ప్రతీ స్టార్ హీరో కూడా మూవీ బడ్జెట్ రూ.100 కోట్లకు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడు. అంతేకాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ని విక్రయిస్తున్నారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ తిరిగి రావాలంటే దాదాపు రూ.200 కోట్లు వసూలు చేయాలి.
‘బాహుబలి’, ‘RRR’ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’, ‘సాహో’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల బిజినెస్ జరిగింది. వీటిల్లో కేవలం జక్కన ‘బాహుబలి’, ‘RRR’ మాత్రం పెట్టిన పెట్టుబడికి లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలిన అన్ని సినిమాలు డిస్టిబ్యూటర్లకు నష్టాలనే తెచ్చిపెట్టాయి.
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..
ఇప్పుడు ‘గుంటూరు కారం’, ‘దేవర’, ‘కల్కీ 2898ఏడీ’, ‘ఓజీ’, ‘పుష్ఫ 2’, మెగాస్టార్ ‘విశ్వంభర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల బిజినెస్ జరిగింది. సంక్రాంతికి 8 సినిమాలతో పోటీపడి బరిలో దిగుతున్న ‘గుంటూరు కారం’ సూపర్ హిట్ స్టేటస్ కొట్టాలంటే దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టాల్సిందే.