Pushpa 2 : ప్రముఖ టీవీ9 జర్నలిస్టు దేవి నాగవల్లి ఇప్పుడు మరొక కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నారు. న్యూస్ రీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల వివాదాస్పద చర్చా కార్యక్రమాలతో ఎక్కువగా ప్రజాదరణ పొందారు. ఇప్పుడు, దేవి నాగవల్లి తన జర్నలిజం కెరీర్‌కు తగ్గట్టే మరో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు.
దేవి నాగవల్లి ప్రస్తుతం పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటైన ‘పుష్ప 2’లో సుకుమార్ డైరెక్షన్ టీంలో భాగమయ్యారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ విజయం తర్వాత భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ సినిమాకు దేవి నాగవల్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం.
Pushpa 2 postponed : పుష్పరాజ్ భయపడ్డాడా..!?
దేవి, టీవీ9లో జర్నలిస్ట్ గా పని చేస్తూనే, డైరెక్షన్ లోకి అడుగుపెట్టడం సుకుమార్ శిష్యురాలిగా ఆమె దక్కిన మంచి అవకాశంగా చెప్పవచ్చు. సుకుమార్ శిష్యులు గతంలో దర్శకులుగా తమదైన గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, దేవి నాగవల్లి కూడా తన మార్క్ చూపించనుందనే అంచనాలు ఉన్నాయి.
పుష్ప 2 మూవీకి ఆమె చేస్తున్న సహకారం ఎంతగా ఎక్సైట్ చేస్తుందో, రాబోయే రోజుల్లో ఆమె ఏ విధంగా హిట్ కొడుతుందో చూసి తీరాలి. సుకుమార్ శిష్యురాలిగా దేవి నాగవల్లి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.