Chandra Mohan Shocking Comments on Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమ నేడు, చంద్రమోహన్‌లాంటి మంచి నటుడిని కోల్పోయింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ఆరంభంలో సంచలన విజయాలు అందుకున్న చంద్ర మోహన్, నటుడిగా దాదాపు 940 చిత్రాల్లో నటించారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కొన్ని చిత్రాల్లో విలన్‌గానూ నటించి నవరస నట పోషకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నటుడు చంద్రమోహన్ ఇక లేరు! హీరోగా సంచలన విజయాలు అందుకుని..
చంద్రమోహన్, చిరంజీవి కెరీర్ దాదాపు ఒకే సమయంలో మొదలైంది. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి చంద్రమోహన్ చెప్పిన కామెంట్లు అప్పట్లో టాలీవుడ్లో పెద్ద చర్చకు తెర తీశాయి.
‘చిరంజీవిని మేము అర్జునుడితో పోలుస్తాం. ఎందుకంటే కృష్ణుడి తోడు ఉండడం వల్లే అర్జునుడి కురుక్షేత్రంలో గెలవగలిగాడు. సినీ పరిశ్రమ కూడా కురుక్షేత్రం లాంటిదే. చిరంజీవి, అర్జునుడు అయితే అతన్ని ముందుండి నడిపించింది మాత్రం అల్లు అరవింద్.
నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ షాకింగ్ కామెంట్స్..
అల్లు గారి అల్లుడిగా మారిన తర్వాత చిరంజీవి ఏ సినిమా చేయాలి? ఏ రోల్ సెలక్ట్ చేసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఇలా ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు అల్లు అరవింద్. అల్లు అరవింద్ గైడెన్స్ లేకపోతే, చిరంజీవి కూడా నాలాగే ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చేది..’ అంటూ కామెంట్ చేశాడు చంద్రమోహన్..
చంద్ర మోహన్ మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవితో పోటిపడి సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్, నరేశ్, భానుచందర్, మురళీ మోహన్, చంద్ర మోహన్ వంటి నటులంతా కొన్నేళ్ల తర్వాత క్యార్టికర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. కేవలం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున మాత్రం కొన్ని తరాల పాటు హీరోగా కొనసాగారు. చిరంజీవి అలాంటి ఇమేజ్ కొనసాగించడానికి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ సపోర్ట్ ఉందనేది ఎవ్వరూ కాదనలేని నిజం.
కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..