ఆ బాధ నుంచి ఇంకా తేరుకోని రోహిత్.. మ్యారేజ్ డే స్పెషల్‌గా మీడియా ముందుకి..

Rohit Sharma Open up on World Cup Defeat : భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా ఆడిన ఐదు ఫైనల్స్‌లో టైటిల్ సాధించిన రోహిత్, భారత జట్టు కెప్టెన్‌గా కూడా అదే ఫీట్ రిపీట్ చేయాలని అనుకున్నాడు. అయితే ఐపీఎల్‌ టైటిల్ గెలిచినంత ఈజీగా ఐసీసీ టైటిల్ రాదని చాలా రోజులకు అర్థమైంది రోహిత్‌కి..

Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..

T20 వరల్డ్ కప్ 2022, ప్రపంచ కప్ 2023 పోటీల్లో భారత జట్టు టైటిల్స్ గెలవలేకపోయింది. ఆ మధ్యలో ఆసియా కప్ 2023 గెలవడం ఒక్కటే రోహిత్ సాధించిన గొప్ప విజయం. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు రోహిత్ శర్మ.

ఎట్టకేలకు నెల రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చాడు. డిసెంబర్ 13న తన పెళ్లి రోజు కావడంతో ముంబై ఇండియన్స్‌తో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించాడు రోహిత్ శర్మ. నెల రోజులైనా ఇంకా ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిని మరిచిపోలేకపోతున్నానని అన్నాడు రోహిత్. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఆ మేనేజర్ మతిమరుపు, సావిత్రి కెరీర్‌నే మార్చేసింది! భానుమతి ప్లేస్‌లో ‘మహానటి’..

2007లో భారత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, 2012లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మారిన తర్వాత స్టార్ ప్లేయర్‌గా మారాడు. టీమిండియాకి ఓపెనర్‌గా మారి, వైస్ కెప్టెన్‌గా మరి.. 2021 పొట్టి ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకి త్రీ ఫార్మాట్ కెప్టెన్‌గా మారాడు. 2015లో మేనేజర్ రితికాని ప్రేమించి పెళ్లాడాడు రోహిత్ శర్మ. వీరికి సమైరా అనే ఓ కూతురు ఉంది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post