మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
Mohammed Shami Life Story : షమీ.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. హార్ధిక్ పాండ్యా గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ, 3 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.
సీఎం క్షమాపణలు చెప్పక తప్పలేదు..!
అయితే మహ్మద్ షమీకి సక్సెస్ అంత ఈజీగా దక్కలేదు. 2015 వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ గాయపడినా, పెయిన్ కిల్లర్స్ తీసుకొని భారత బౌలింగ్ దళాన్ని ముందుగా నడిపాడు. ఆ ప్రపంచ కప్‌లో 17 వికెట్లు తీసి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.
1990 మార్చి 9న మహ్మద్ షమీ జన్మించాడు. షమీ తండ్రి ఓ సాధారణ రైతు. ఆయన తన బాల్యంలో ఫాస్ట్ బౌలర్ కూడా. షమీకి ముగ్గురు సోదరులు. ఈ ముగ్గురు కూడా ఫాస్ట్ బౌలర్స్ కావటం విశేషం.
షమీ బౌలింగ్ టాలెంట్ గమనించిన అతని తండ్రి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీలో చేర్పించారు. షమీ అండర్ 19 సెలక్షన్ వెళ్ళినా సరే, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఎంపిక కాలేకపోయాడు. ఆ తర్వాత అతను కోల్‌కత్తాకు పయనమయ్యాడు.
అక్కడ ఒక క్లబ్ తరుపున ఆడేవాడు. మాజీ బెంగాల్ క్రికెటర్, మాజీ అసిస్టెంట్ సెక్రటరీ దాస్ దృష్టిలో పడ్డారు. దాస్, షమీకి 75 వేల రూపాయల టౌన్ క్లబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. అలా బెనర్జీ బెంగాల్ క్లబ్ తరుపున అండర్ 22 క్రికెట్ ఆడాడు.
ఈ సమయంలో షమీకి సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసేవాడు. అలా సౌరవ్ గంగూలీ దృష్టిలో పడిన షమీ, సెలెక్టర్స్ ఆకర్షించాడు. ఆ తర్వాత 2010లో అస్సాం తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. మొదటి మ్యాచ్‌లోనే అతను మూడు వికెట్లు తీశాడు.
2012లో రంజీ ట్రోఫీకి ఆడి, ఐపీఎల్ జట్టులో రాణించాడు. 2013న పాకిస్థాన్‌తో వన్డే క్రికెట్ మ్యాచ్‌తో ఆరంగ్రేటం చేసిన షమీ, తొలి మ్యాచ్‌లోనే 4 మెయిడిన్లు వేసి రికార్డు సృష్టించాడు. అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 5 వికెట్లు తీశాడు షమీ.
అయితే వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషనల్ కెరీర్లో ఎదురైన అవమానాలు, అనుకోని సంఘటనల కారణంగా మానసికంగా కృంగిపోయిన మహ్మద్ షమీ, మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ వేదిక పంచుకున్నాడు షమీ.
2015లో గాయంతో 18 నెలల విశ్రాంతిని తీస్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపాడు. మహ్మద్ షమీ భార్య హసిన్ జాహాన్, అతనిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో షమీ, తన తండ్రి ని కూడా పోగొట్టుకున్నాడు.
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..
ఎన్నో సమస్యలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడిన మహ్మద్ షమీ, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక సార్లు నాలుగేసి వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే 45 వికెట్లతో వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భార బౌలర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు.