Thala for A Reason : ధోనీ, మాహీ, MSD, మిస్టర్ కూల్ కెప్టెన్, కెప్టెన్ కూల్… టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎన్నో పేర్లు! మాహీ కనిపిస్తే చాలు, అదో మైకంతో ఊగిపోతారు అభిమానులు. మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా మాహీ కొట్టే సిక్సర్లు చూసి కేరింతలు కొడతారు. క్రికెట్ ప్రపంచంలో మాహీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ మరో లెవెల్.. అయితే నిజంగా మహేంద్ర సింగ్ ధోనీ, ఇంత క్రేజ్‌కి అర్హుడేనా! చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే మాహీ ఓ ఓవర్ రేటెడ్ క్రికెటర్.. ఎందుకంటే..
ధోనీ సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. అయితే ఆ టోర్నీలో బ్యాటర్‌గా ధోనీ ఫెయిల్ అయ్యాడు. గొప్పగా సాధించిందేమీ లేదు. ఫైనల్ మ్యాచ్‌లో ఫైనల్ ఓవర్ జోగిందర్ శర్మతో వేయించాలనేది తన నిర్ణయం అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అయితే భజ్జీ చెప్పడం వల్లే, జోగిందర్కి బాల్ ఇచ్చామని యువీ బయటపెట్టాడు. అంటే అక్కడ భజ్జీకి క్రెడిట్ దక్కలేదు.
MS Dhoni Birthday Special : సరిలేరు ధోనీకెవ్వరు..
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ పెద్దగా చించేసింది, పొడిచేసిందీ ఏమీ లేదు. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ అవుట్ కాగానే యువీకి బదులుగా ధోనీ వెళ్లాడు. నిజానికి అప్పటికే టీమిండియా విజయానికి చాలా దగ్గరగా వచ్చేసింది. ఆ ప్లేస్‌లో ధోనీ కాకుండా యువీ వచ్చినా మ్యాచ్ రిజల్ట్ మారిపోయేది కాదు. అలా వెళ్లాలనే నిర్ణయం తానే తీసుకున్నానని ‘ఎమ్మెస్ ధోనీ’ బయోపిక్‌లో చూపించారు. అయితే ఆ నిర్ణయం కూడా సచిన్ టెండూల్కర్‌దే.. విరాట్ అవుటైతే ధోనీ, గంభీర్ అవుటైతే యువీ వెళ్లాలని సచిన్ టెండూల్కర్, టీమిండియాకి సూచించాడు. మాహీ అదే చేశాడు..
అయితే సచిన్ టెండూల్కర్ చెప్పడం వల్లే తాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చినట్టు మాహీ ఎప్పుడూ చెప్పలేదు. వీటన్నింటికంటే 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మాహీ బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల కారణంగా ఆ ట్రోఫీ గెలిచింది భారత జట్టు..
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..
2014 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్లో ఓడింది. ఆ మ్యాచ్‌లో బెస్ట్ ఫినిషర్ అని చెప్పుకునే మాహీ 7 బంతులు ఆడి 4 పరుగులు చేశాడు. యువీ వల్లే ఓడిపోయామని అతనిపైన తోసేశారు మాహీ ఫ్యాన్స్.. ఇలా మహేంద్ర సింగ్ ధోనీకి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు, దక్కాల్సిన దానికంటే ఎక్కువ క్రెడిట్ దక్కిందనేది క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. అయితే ధోనీని దేవుడిలా కొలిచే కొంతమంది భక్తులు మాత్రం మాహీని తక్కువ చేస్తే అస్సలు ఒప్పుకోరు.. ఆఖరికి టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో గెలిచినా, ‘Thala for A Reason’ అంటూ మాహీకి క్రెడిట్ అప్పగించేస్తారు..