Ravi Teja Eagle Movie : దసరాకి విడుదలైన మూడు సినిమాల్లో ఎన్నో అంచనాలతో వచ్చిన విజయ్ ‘లియో’ భారీ లాభాలను అందించింది. బాలయ్యబాబు ‘భగవంత్ కేసరి’ కూడా హిట్టు మెట్టు ఎక్కేసింది. అయితే రవితేజ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం ఫ్లాప్ అయ్యింది.
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..
3 గంటలకు పైగా నిడివితో థియేటర్లలోకి వచ్చిన ‘టైగర్’, మూడు రోజుల తర్వాత అరగంట నిడివి తగ్గింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీకి చాలా తక్కువ థియేటర్లు దక్కాయి. ఇదే కలెక్షన్లపై ప్రభావం చూపించింది.
రవితేజ మూవీని ఒక్క వారం ముందు రిలీజ్ చేసినా, ఒక్క వారం తర్వాత రిలీజ్ చేసినా కచ్ఛితంగా హిట్టు కొట్టి ఉండేది. పంతాలకు పోయి, పోటీలో దిగిన రవితేజ.. ఫ్లాప్‌ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి ‘ఈగల్’ విషయంలోనూ ‘మాస్ రాజా’ ఇదే తప్పు చేస్తున్నాడని అంటున్నారు మూవీ ఎక్స్‌పర్ట్స్.
స్కూల్స్ బంద్.. బండ్లు రోడ్లు ఎక్కాలంటే రూల్.. ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి..
సంక్రాంతికి మహేష్ ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామి రంగ’, తేజ సజ్జ ‘హనుమాన్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీస్ విడుదల అవుతున్నాయి. ‘గుంటూర్ కారం’ జనవరి 12కి వస్తుంటే, రవితేజ ‘ఈగల్’ మూవీ జనవరి 13న విడుదల అవుతోంది.
మహేష్ మూవీకి హిట్ టాక్ వస్తే, రవితేజ ‘ఈగల్’ మూవీపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ‘ఈగల్’ టాక్ కాస్త తేడా కొట్టినా సంక్రాంతికి అరడజను సినిమాలు ఉండడంతో హిట్టు కొట్టడం కష్టమైపోతుంది. ఈసారి అయినా రవితేజ ఇగోలకు పోకుండా డేట్ విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు..
నెట్‌ఫ్లిక్స్‌లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి వీడియో… సినిమా రైట్స్ రేటుకి అమ్మేసిన మెగా ఫ్యామిలీ..