Netflix buys Varun Tej-Lavanya wedding video : ఫెవరెట్ హీరో పెళ్లి వేడుక చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఇంతకుముందు హీరోల ఇళ్లల్లో జరిగే వేడుకలకు సంబంధించిన వీడియోలు కూడా టీవీ ఛానెళ్లలో, న్యూస్ ఛానెళ్లలో ప్రత్యేక్ష ప్రసారం అయ్యేవి. అయితే ఇప్పుడు రేంజ్ పెరిగింది. టీవీ ఛానెళ్లలో లైవ్ ఇవ్వడం కంటే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అమ్ముకోవడం వల్ల పెళ్లి ఖర్చుకు డబుల్ ఆదాయం వచ్చేస్తోంది.
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్- అలియా భట్, కత్రీనా కైఫ్- విక్కీ కౌషల్, కాజల్ అగర్వాల్… ఇలా పెళ్లి వేడుక రైట్స్‌ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి అమ్మేసిన సెలబ్రిటీల సంఖ్య భారీగానే ఉంది. తాజాగా ఈ లిస్టులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు.
తనతో కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమాల్లో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్. వీరి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధుమిత్రుల మధ్య ఇటలీలో నవంబర్ 1న జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు వరుణ్‌లవ్ (VarunLav)..
ఈ వివాహ వేడుక రైట్స్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయగా, రూ.8 కోట్లకు ఢీల్ ఫైనల్ అయినట్టు సమాచారం. అయితే పెళ్లి ఖర్చులు పోనూ మెగా ఫ్యామిలీకి బాగా లాభాలు గిట్టినట్టేనని టాలీవుడ్ టాక్.
స్కూల్స్ బంద్.. బండ్లు రోడ్లు ఎక్కాలంటే రూల్.. ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి..