Deepfake Video : ఒకప్పుడు ఫేక్ న్యూడ్ ఫోటోలు వెబ్సైట్లలో విరివిరిగా దొరికేవి. అయితే ఇప్పుడు ఫోటోల నుంచి వీడియోల దాకా వెళ్లిందీ టెక్నాలజీ. డీప్ ఫేక్ వీడియోలకు, పోర్న్ వెబ్సైట్లలో భారీ డిమాండ్ ఉంది. హీరోయిన్ల ముఖ కవళికలను కాప్చర్ చేసి, పోర్న్ స్టార్స్ ముఖాల ప్లేస్‌లో రీప్లేస్ చేయడమే డీప్ ఫేక్.
కొన్నిసార్లు ఈ ఫేక్ వీడియోలను ఎంత క్లారిటీతో ఉంటాయంటే, నిజంగా హీరోయిన్ల వీడియోలే లీక్ అయ్యారేమో అనిపించేంతగా. తాజాగా రష్మిక మందన్న చిన్న స్లీవేజ్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్‌లోకి వస్తున్నట్టుగా ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నిజానికి జారా పటేల్ అనే మోడల్ వీడియోని డీప్ ఫేక్ చేసి, రష్మిక వీడియోగా మార్చారు.
దీనిపై ఓ నెటిజన్ వేసిన ట్వీట్‌పై అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అవ్వడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. రష్మిక మందన్న కూడా ఈ వీడియో తనను ఎంతగానో బాధపెట్టిందని ట్వీట్ చేసింది. ‘ఇలాంటి వీడియోలు నాకే కాదు, అందరికీ ప్రమాదకరమే. టెక్నాలజీని ఇలా తప్పుదోవలో వాడుతున్నవారికి కఠినంగా శిక్షించాలి.
సీఎం క్షమాపణలు చెప్పక తప్పలేదు..!
ఓ మహిళగా, ఓ నటిగా నాకు అండగా నిలిచిన నా కుటుంబం, నా స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటివి నేను స్కూల్ నుంచే ఎదుర్కొంటున్నా. ఇకనైనా వీటిని అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి..’ అంటూ ట్వీట్ చేసింది రష్మిక మందన్న..
దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించాడు. ‘డీప్ ఫేక్ వీడియోలు కూడా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడంతో సమానం. ఐటీ రూల్స్ ప్రకారం ఇలాంటివి పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకోబడతాయి. ఏ యూజర్ అయినా తప్పుడు సమాచారం పోస్ట్ చేయకూడదు. అలా పోస్ట్ చేసిన దానికి 36 గంటల్లోగా తొలగించాలి. ఇలాంటి డీప్ ఫేక్స్ మరింత ప్రమాదకరమైనవి. ’ అంటూ ట్వీట్ చేశాడు రాజీవ్ చంద్రశేఖర్. అలాగే సెలబ్రెటీలు అక్కినేని నాగచైతన్య, మృణాల్ ఠాకూర్ తదితరులు రష్మికకు సపోర్ట్ గా నిలిచారు.
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..