Pulusu Pindi : బియ్యం రవ్వతో ఉప్మా లేదా బియ్యం రవ్వ కుడుములు చేస్తూ ఉంటారు కానీ బియ్యం రవ్వతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. తొందరగా అరిగిపోతుంది కూడా.. రోజూ రొటీన్ గా తినే ఇడ్లీ దోశ కాకుండా కొత్తగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ పులుసు పిండి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు.
కావాల్సిన పదార్థాలు :
* ఒక కప్పు బియ్యం రవ్వ
* 3 నిమ్మకాయలు (చింతపండుతో అయితే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి)
* పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్
* వేరుశనగ గింజలు రెండు టేబుల్ స్పూన్లు
* సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి
* సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు
* ఎండు మిరపకాయలు రెండు
* సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు టేబుల్స్పూన్
* కరివేపాకు రెండు రెమ్మలు
* పసుపు చిటికెడు
* ఉప్పు రుచికి తగినంత
* ఇంగువ చిటికెడు
* నూనె నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
ముందుగా బియ్యం రవ్వ వేసి 5 నిమిషాలు దోరగా వేగించుకోవాలి. అందులో ఒకటికి.. రెండు గ్లాసుల వాటర్ పోసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పసుపు అలాగే ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పిండి పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపుదినుసులు, వేరుశనగ గింజలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అల్లం ముక్కలు అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే ఇంగువ వేసుకొని ఈ తాలింపు ని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమంలో కలుపుకోవాలి. ఉప్పు పులుపు చూసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
Note : ఒకవేళ మీరు చింతపండుతో చేయాలి అనుకుంటే ఆ తాలింపు వేగిన తర్వాత ఆ చింతపండు గుజ్జు కూడా అందులో వేసి నూనె పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. అప్పుడు ఆ మిశ్రమం మొత్తం ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమంలో కలుపుకుంటే సరిపోతుంది.