Mulakkada Kodiguddu Pulusu : మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మునక్కాయని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆస్తమా, దగ్గు, గురక, ఇతర శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. అలాగే డైట్ చేసేవాళ్లు ఈ ములక్కాడని మీ డైట్ లో భాగంగా చేసుకుంటే వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇక గుడ్డు విషయానికొస్తే ఇందులో పోషకలు గురించి అందరికీ తెలిసిందే ఇందులో బోలెడంత ప్రోటీన్ దొరుకుతుంది. ఈ రెండు కలిపి చేసే కోడిగుడ్డు ములక్కాడ పులుసు తింటే ఆహా అనాల్సిందే. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు..
Mamidikaya Chepala Pulusu : మామిడికాయ చేపల పులుసు..
కావాల్సిన పదార్థాలు :
* ములక్కాడలు రెండు అంగుళాల ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
* కోడిగుడ్లు ఒక నాలుగు ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
* టమాట ఒకటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
* ఉల్లిపాయలు నాలుగు.. ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
* చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి.
* కరివేపాకు రెండు రెమ్మలు
* పచ్చిమిర్చి 4… పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి
* కారం రెండు టేబుల్ స్పూన్లు
* పసుపు చిటికెడు
* ఉప్పు రుచికి సరిపడ
* నూనె మూడు టేబుల్ స్పూన్లు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్
* కొత్తిమీర కొద్దిగా
తయారీ విధానం :
స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ పులుసులో చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ తీసి పక్కన పెట్టి.. అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
Kakarakaya Nilva Pachchadi : కాకరకాయ నిల్వ పచ్చడి..
అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు వేగించిన తర్వాత , ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ములక్కాడ మొక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసి ఉప్పు కారం పసుపు అన్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుని పులుసు దగ్గరకి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పుల్లపుల్లటి ములక్కాడ కోడి గుడ్డు పులుసు రెడీ..