Mamidikaya Chepala Pulusu : సమ్మర్ స్టార్ట్ అవుతుంది.. మండే ఎండలతో పాటు పుల్లని మామిడికాయలు కూడా వచ్చేస్తాయి. వేసవికాలం అంటే బాబోయ్ ఎండలు అని అనుకునే వాళ్లకంటే.. అబ్బా సంవత్సరం అంతా ఎదురు చూసే మామిడి కాయలు, పండ్లు వస్తున్నాయని ఆనందపడే వారే ఎక్కువ. మరి అలాంటి మామిడికాయతో ఈ సీజన్ మొత్తం ఎన్నో రకాల పుల్లటి, కమ్మటి వంటలు చేసుకోవచ్చు అందులో ఒకటి.. మామిడికాయ చాపల పులుసు. పేరు వినగానే నోరూతుంది కదూ.. ఆలస్యం చేయకుండా మామిడికాయ చేపల పులుసుకి ఎలా చేయాలో చూద్దాం..
Kakarakaya Nilva Pachchadi : కాకరకాయ నిల్వ పచ్చడి..
కావాల్సిన పదార్థాలు :
* చాపలు కేజీ క్లీన్ చేసి శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి.
* పుల్లటి మామిడికాయ ఒక్కటి ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి, టెంక కూడా వేసుకోవచ్చు.
* టమాట ఒకటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
* చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు నాన్న పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
* ఉల్లిపాయలు ఒక నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
* నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు
* రెండు కరివేపాకు రెమ్మలు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు
* గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు యాలికలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, నాలుగు లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, అన్ని కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పొడి చాపల పులుసులోకి చాలా బాగుంటుంది.
* పసుపు 1/4 టేబుల్ స్పూన్
* కారం రెండు టేబుల్ స్పూన్లు
*కల్లుప్పు రుచికి సరిపడినంత (కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయిన వేసుకోవచ్చు)
తయారీ విధానం..
ముందుగా క్లీన్ చేసుకున్న చాప ముక్కలకి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
Indian Students in Abroad : కోటి ఆశలతో విదేశాలకు వెళ్లి, విగతజీవులుగా తిరిగి వస్తూ..
తర్వాత టమాట ముక్కల్ని కూడా వేసి ఒక నిమిషం మగ్గనివ్వాలి. టమాట ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా టెంకతో సహా వేసుకోవాలి. మామిడికాయ కొంచెం మగ్గిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం వేసి పులుసు మరుగునివ్వాలి. పులుసు ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చాప ముక్కలు అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
చాప ముక్కలు వేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టకూడదు. కడాయి రెండువైపులా పట్టుకొని కదుపుతూ మొక్కలు చెదిరిపోకుండా మరొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి మరొక ఐదు నిమిషాలు పులుసు దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పులుసు ఉదయం చేస్తే సాయంత్రానికి, సాయంత్రం చేస్తే ఉదయానికి రుచి రెట్టింపు అవుతుంది.