Kedareswara Vratham : కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. ఎంతో వైభవంగా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలో శివపార్వతులకు అభిషేకం, తోరపూజ,పూజ వ్రత కథ, వాయనం, దీప దానం, వేద బ్రహ్మనునిచే చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, ఆయురారోగ్యములకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం.
ఈ వ్రతం తెలంగాణా ప్రాంతంలో ఆశ్వీయుజ అమావాస్య రోజున ఆచరిస్తే, ఆంధ్ర ప్రాంతం వారు కార్తీక మాసములో ఏదైనా రోజున లేదా చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి రోజున ఆచరిస్తారు. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.
ఈ నోము నోచుకున్నవారికి అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.