Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి హిందూ పండగల్లో చాలా ముఖ్యమైనది. అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజు హిందువులందరూ నదీస్నానం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. నదీస్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్ముకం. నదీస్నానం వీలు కానీ వాళ్ళు కనీసం చెరువు లేదా కాలవలో అయినా స్నానాలు చేసి తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ముత్యమంతా పసుపు.. ముఖమెంతో ఛాయా..
కార్తీక పౌర్ణమి.. దేవతలను సంతోష పెట్టడానికి ఒక ప్రాధానమైన రోజు. ఈరోజు అనేకమంది తమకు తోచిన దానాలు, అలాగే దీపాలను కూడా దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం వస్తుందని నమ్ముతారు. అందుకోసమే కార్తీకపౌర్ణమి రోజు మనం ఏ దేవాలయాలు చూసిన ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజు అనేకమంది భక్తిశ్రద్ధలతో నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు.
కొంతమంది భక్తులు పౌర్ణమి వ్రతం చాలా నిష్ఠగా పడతారు. తరువాత పౌర్ణమి పూజ చేసి పౌర్ణమి గడియాలు ముగిసిన తర్వాత దేవాలయాల్లో వ్రతాన్ని ముగిస్తారు.
ఈ పండగ రోజు శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మారుమగుతూ ఉంటాయి. ఈ పౌర్ణమి మన పురాణాలు గ్రంథాలు అనేక విధములుగా వర్ణించారు. ఈ పౌర్ణమి రోజు పరమశివుడు త్రిపురాంతీశ్వరుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు మనకు పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. అందుకోసమని ఈ పౌర్ణమును “త్రిపుర పౌర్ణమి” అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజు భక్తులు పరమశివుని దీపారాధన చేస్తారు. శివుడు ఆ రాక్షసుడు బారి నుంచి ప్రజలను విముక్తులను చేయడంతో ఈ పండగ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, ఉసిరికాయ దానంతో పాటు పేదలకు అన్నదానం వస్త్ర దానం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు పాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి మన కుటుంబంలో వారికి ఆరోగ్యం మరియు మనశ్శాంతి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉంటారు.
కార్తీక పౌర్ణమి రోజు గంగాస్నానం మాత్రమే కాదు, దీపదానం ఇతర దానాల చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈరోజు క్షీరసాగర దానానికి అత్యంత ప్రత్యేకత ఉంది. కార్తీక పౌర్ణమి రోజు గౌరీ దేవి నోముల నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకగా జరుపుకుంటారు.
కార్తీక మాసంలో పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత 15 రోజులకు వస్తుంది అంటే.. ఇది చీకటిలను తొలగించి వెలుగుల్ని ప్రసాదిస్తుంది. ఈ పవిత్రమైన రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన లేదా ఈ కథ విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజు సాయంత్రం వేళ సంధ్యాసమయంలో ఏదైనా శివాలయంలో రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర లేదా పెద్ద ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం.
కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు, అభిషేకాలు చేయించాలి ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడు. తన అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ పవిత్రమైన రోజు తులసి చెట్టు పక్కనే ఉసిరికాయను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజ చేస్తే కోరుకున్న వారు జీవిత భాగస్వామిగా వస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపదానం చేస్తే దారిద్రం తొలగిపోతుంది. లలిత సహస్రనామం జపిస్తే సిరిసంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ పురాణాలు పారాయణ చేసిన కూడా డబ్బు కొరత అనేది ఉండదంట. అదే విధంగా ఏదైనా శివాలయాలు లేదా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే గొప్ప ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.