ఇషాన్ కిషన్‌కి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్! అసలు క్రికెటర్లకు ఎందుకీ సమస్య 

‘యానిమల్’ మూవీ టైమ్‌లో సెలబ్రిటీలకు మెంటల్ హెల్త్ సమస్యల గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అనిల్ కపూర్, రణ్‌బీర్ సింగ్, టాలీవుడ్ నుంచి మహేష్ బాబు కూడా మెంటల్ హెల్త్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్తుంటారని షాకింగ్ కామెంట్స్ చేశాడు సందీప్. తాజాగా భారత క్రికెటర్ ఇషాన్ కిషన్, ఇదే కారణాలతో టీమ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.

బెస్ట్ హాంకాంగ్ మూవీ షావోలిన్ సాకర్..

ఇషాన్ కిషన్ వయసు 23 ఏళ్లు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి బాగా ఆడి, జట్టులోకి వచ్చేశాడు. అయితే శుబ్‌మన్ గిల్ కారణంగా ఇషాన్ కిషన్‌కి తగినన్ని ఛాన్సులు రాలేదు. వచ్చిన ఛాన్సులను ఇషాన్ సరిగా వాడుకోలేకపోయాడు కూడా. మూడు ఫార్మాట్లలో ఇషాన్ కిషన్‌కి చోటు ఉంది. అయితే ఆడుతున్న మ్యాచుల సంఖ్య మాత్రం చాలా తక్కువ.

Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..

2021, 2022 టీ20 వరల్డ్ కప్స్, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడిన టీమ్స్‌లోనూ ఇషాన్ కిషన్ ఉన్నాడు. అయితే ఆడింది మాత్రం ఒకటి రెండు మ్యాచులే. ఇలా ఎప్పుడు ఆడిస్తారో, ఎప్పుడు కూర్చోబెడతారో తెలియక ఇషాన్ కిషన్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడట. మూడేళ్లుగా క్రికెట్ ఆడుతూ, వ్యక్తిగత జీవితానికి కూడా పూర్తిగా దూరం కావడంతో మెంటల్ హెల్త్ కోసం కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. ఇంతకుముందు బెన్ స్టోక్స్, విరాట్ కోహ్లీ, యువరాజ్ కూడా ఇలాంటి సమస్యలను ఫేస్ చేశారు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post