Ind vs Aus Final : క్లాస్ రూమ్‌లో ఎవ్వరైనా ఆన్సర్ చెబుతాడు, ఫైనల్ ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్ అవుతాడు. చదువుల్లోనే కాదు, ఆటల్లోనే అంతే. వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ స్టేజీలో అదరగొట్టిన భారత బ్యాటర్లు, ఫైనల్‌లో తేలిపోయారు. ఈ వరల్డ్ కప్‌లో మొట్టమొదటి ఆలౌట్ అయ్యింది. ఒత్తిడికి చిత్తుగా ఓడి, అతి జాగ్రత్తతో ఆడి… బౌండరీలు కొట్టడానికి తెగ ఆయాస పడ్డారు. ఫలితంగా ఫైనల్‌లో ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల ఈజీ టార్గెట్ నిలిచింది.
ప్రపంచ కప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడినా తక్కువేమీ కాదు..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయి 107 బాల్స్ ఆడి 66 పరుగులు చేశాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బౌండరీ ఉందంటే అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు..
గెలవాలి అయ్యా! ఎలాగైనా గెలవాలి.. పూజలు, ప్రార్థనలు, హోమాలతో టీమిండియా ఫ్యాన్స్..
విరాట్ కోహ్లీ 54 పరుగులు చేశాడు. 11వ ఓవర్ నుంచి 50వ ఓవర్ మధ్య భారత జట్టు చేసింది కేవలం 4 ఫోర్లు మాత్రమే. నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఐపీఎల్‌లో అదరగొట్టే జడేజా కూడా బౌండరీలు కొట్టడానికి తెగ కష్టపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రెషర్‌కి లోనైన భారత జట్టు, బౌలర్లపైనే భారం వేసింది.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..