Ind vs NZ : సినిమా తర్వాత భారతీయులు అంతగా ఇష్టపడేది క్రికెట్. ఇంకా చెప్పాలంటే క్రికెట్ కోసం సినిమాలను కూడా పక్కనబెట్టేస్తారు. అందుకే భారత క్రికెట్ బోర్డు ఖజానాలో ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ కప్ 2023 టోర్నీలో భారత జట్టు, 9కి 9 మ్యాచులు గెలిచి సెమీస్ చేరింది.
10 ఏళ్లుగా నాకౌట్ భయం! ఈసారి అయినా దాటుతారా… 2014 నుంచి అదే తీరు..
సెమీ ఫైనల్ మ్యాచ్‌ని ముంబైలో న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్ గురించి టెన్షన్ పడుతున్నారు. 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఈసారి మనోళ్లు ఎంత బాగా ఆడినా, సెమీ ఫైనల్లో అలాగే ఆడతారా? లేక టెన్షన్‌తో మ్యాచ్‌ని అప్పచెప్పేస్తారా? అనే టెన్షన్‌తో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి నిద్ర కూడా పట్టడం లేదు.
2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడిన టీమ్‌లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.. ఈసారి కూడా సెమీస్ ఆడుతున్నారు. మిగిలిన వారంతా మొదటిసారి వరల్డ్ కప్ సెమీస్ ఆడుతున్నారు. దీంతో భారత జట్టు ఎలాగైనా గెలవాలని కోరుకుంటూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు భారత జట్టు ఫ్యాన్స్.. ఇంకొందరైతే టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ హోమాలు కూడా జరిపిస్తున్నారు.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ భారత జట్టు సెమీ ఫైనల్‌కి వెళ్లింది. అయితే 2015లో ఆస్ట్రేలియా చేతుల్లో, 2019లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా మిగిలిన రెండు అడుగుల గండాన్ని భారత్ విజయవంతంగా దాటేయాలని దండాలు పెట్టుకున్నారు అభిమానులు.