ICC World Cup Prize Money : వన్డే ప్రపంచ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా- ఇండియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి తెర పడనుంది. 10 జట్లతో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో నాలుగు జట్లు ఫైనల్ చేరగా, రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
1983 World Cup History : వరల్డ్ కప్ ను ముద్దాడిన వేళ..
వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన జట్లుకి బంగారంతో చేసిన ట్రోఫీతో పాటు 40 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుంది. భారత కరెన్సీ ప్రకారం దాదాపు 33 కోట్ల రూపాయలు. అదే ఫైనల్‌లో ఓడిన టీమ్‌కి ఇందులో సగం అంటే 20 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది.
సెమీస్ చేరిన రెండు జట్లకు తలా 8 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ చెల్లించారు. అంటే దాదాపు 6 కోట్ల 70 లక్షల వరకూ దక్కించుకున్నాయి సౌతాఫ్రికా, న్యూజిలాండ్.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
వరల్డ్ కప్‌లో పాల్గొని, గ్రూప్ స్టేజీ నుంచి వెళ్లిపోయిన 6 జట్లకు ఒక్కో లక్ష డాలర్లు ప్రైజ్ మనీగా అందింది. అలాగే గ్రూప్ స్టేజీలో ఒక్కో మ్యాచ్ గెలిచినందుకు 40 వేల డాలర్లు అదనంగా అందుతాయి. మొత్తంగా ప్రైజ్ మనీ కోసమే 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఐసీసీ.