Hyderabadi Dum Biryani : వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ ధమ్ బిర్యానీ..

Hyderabadi Dum Biryani : హైదరాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది బిర్యానీనే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఫ్యాన్స్ ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ బిర్యానీ ఇష్టంగా తింటారు. తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, బందర్ లడ్డు, సుబ్బయ్య గారి హోటల్ బుట్ట భోజనం,  హైదరాబాద్ బిర్యానీ ఇది ఒక బ్రాండ్.. వాటి మార్క్ స్టైల్ మళ్లీ ఎక్కడా దొరకదు. అలాంటి హైదరాబాద్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

రోటీ పచ్చళ్ళతో ప్రయోజనాలు..

కావాల్సిన పదార్థాలు :
చికెన్ -350 గ్రాములు (ముక్కలు పెద్దవి గా వుండాలి)
బాస్మతి బియ్యం – 500 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాలు
బిరియాని ఆకులు,
అనాసపువ్వు,
లవంగాలు
కలపాసి,
షాజీర,
జాపత్రి,
దాల్చిన చెక్క,
యాలకులు,
మిరియాలు,
మరాటి ముగ్గ,
జీలకర్ర పొడి  – రెండు చెంచాలు
ధనియాలు  పొడి – రెండు చెంచాలు
పసుపు – సరిపడ
కారం – రెండు చెంచాలు
ఉప్పు – తగినంత
పెరుగు- తగినంత
పుదీన – ఒక కప్పు (తరిగిన)
కొత్తిమీర –  ఒక కప్పు (తరిగిన)
పచ్చిమిరపకాయలు – ఒక కప్పు  (తరిగిన)
ఉల్లిపాయలు – 2
నిమ్మకాయాలు – 3
ఫుడ్ కలర్ – కొద్దిగా
రోజ్  వాటర్ – కొద్దిగా
చపాతీ పిండి – తగినంత
నెయ్యి – సరిపడ
నూనె – 200 గ్రాములు

తయారీ విధానం : 
బిర్యానీ ఆకులు, అనాసపువ్వు, లవంగాలు, కలపాసి, షాజీర, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, మరాటి ముగ్గ అన్నీ కొద్దికొద్ది (5 గ్రా) గా తీసుకొని ముందుగా మసాల పౌడర్ తయారు చేసుకోవాలి.

దాల్చిన చెక్క ఉపయోగాలు..

శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లో ఈ మసాల పౌడర్ కలిపి, దానిలో జీలకర్ర పొడి, ధనియాలు  పొడి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి కలిపి, దానిలో తరిగిన పుదీనా, కొత్తిమీర, పర్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి, అందులో నిమ్మరసం, ఉప్పు, నూనె కూడా వేసి బాగా కలిపి ఒక రాత్రి అంత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి (4-5 గంటలు వరకు).

బిర్యానీ చేసుకునే ముందు బిరియాని రైస్ ఒక అర గంట నానబెట్టుకోవాలి. బిర్యానీ పాన్ (కాస్త మందంగా ఉండాలి) తీసుకుని అందులో అడుగున ముందుగా నానిన చికెన్  పరుచుకోవాలి.

వేరొక గిన్నెలో వాటర్ వేసి అందులో సాల్ట్, షాజీర, బిర్యానీ ఆకు వేసి కలిపి బాగా వేడి అయ్యాక, అందులో నానిన రైస్ వేసి 75% వరకు ఉడకనివ్వాలి. దీన్ని జల్లెడ సహాయంతో వార్చి దీన్ని చికెన్ పైన పరచాలి. దీని పైన ఫ్రై చేసుకున్న  ఉల్లిపాయ ముక్కలు వేసి, పైన నెయ్యి, రోజ్ వాటర్, ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూతకు అంచున చపాతీ పిండిని అతికించాలి.

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65..

దీన్ని పాన్ పైన మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి మూసి వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టి, 10నిముషాలు పెద్ద మంట లో పెట్టి, తర్వాత 15 నిముషాలు చిన్న మంటలో పెట్టి, ఇంకో 20 నిముషాలు చిన్నమంటలో పాన్ కింద రేకు పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇదంతా  అయ్యాక ఒక 5 నిముషాలు ఆగి  మూత థీసి వేడివేడిగా బిర్యానీ  వడ్డించుకోవాలి.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post