Home Made Cold Coffee : చల్లని కాఫీ అదేనండి కోల్డ్ కాఫీ.. దీన్ని చాలా కాస్ట్ పెట్టి మరీ బయట తాగుతూ ఉంటారు. చాలామంది అదొక స్టేటస్ లా కూడా ఫీల్ అవ్వడం అలవాటైంది. అలాగే ఆ కాఫీ రేటు కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. మరి అంత రేట్ పెట్టి ప్రతిసారి కొనుక్కొని తాగే బదులు అలాంటి చల్లని కాఫీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు.
Finger Millet : రాగులతో రోగాలు మాయం..
కావాల్సిన పదార్థాలు :
పాలు – ఒక గ్లాసు (వేడి చేసి చల్లార్చినవి)
వెన్నెల ఐస్ క్రీం – అర కప్పు
కాఫీ పౌడర్ – రెండు చెంచాలు
ఐస్ ముక్కలు – అర కప్పు
పంచదార – రెండు చెంచాలు
వేడి నీరు – కొద్దిగా
తయారీ విధానం :
ఒక గిన్నెలో రెండు చెంచాల వేడి నీరు తీసుకొని కాఫీ పౌడర్ వేసి బాగా కలపి మిశ్రమం చేసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకుని అందులో మిల్క్, కాఫీ మిశ్రమం, పంచదార, ఐస్క్రీం, ఐస్ ముక్కలు,అన్ని వేసి మిక్స్ పట్టాలి. దీన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని పైన కొంచెం కాఫీ పౌడర్ చల్లుకోవాలి. అంతే కూల్ కూల్ కోల్డ్ కాఫీ రెడీ.