Covishield Side Effects : కోవీషిల్డ్ వ్యాక్సిన్‌ వల్లే ఆకస్మిక గుండెపోటు..

Covishield Side Effects : గత ఏడాది, రెండేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా జనాలు గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోతున్న దృశ్యాలు, జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. డ్యాన్స్ చేస్తూ టీనేజ్ కుర్రాళ్లు కూడా గుండెపోటుతో చనిపోవడం చూసి, అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలియక ఓ రకమైన టెన్షన్ వాతావరణం మొదలైంది. ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ప్రభుత్వం సిఫారసు చేసిన కోవీషిల్డ్ వ్యాక్సిన్ వల్లే ఈ ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని, ఆ వ్యాక్సిన్‌ని తయారుచేసిన బ్రిటష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకుంది.

ఈ వ్యాక్సిన్‌లో వాడిన ఔషధాల కాంబినేషన్ కారణంగా టీటీఎస్ (థాంబ్రోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా) అనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. దీని కారణంగా రక్తం గడ్డ కట్టడం, గుండెపోటు మెదడులో రక్త స్రావం వంటివి సంభవించవచ్చని పేర్కొంది ఆస్ట్రాజెనెకా…

Heatwave in India : మండే ఎండలు, వడ గాల్పులు.. ఈసారి వేసవి దంచికొడుతుందట..

యూకేలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతుండడంతో ఆస్ట్రాజెనెకా కంపెనీపై 51 కేసులు నమోదు అయ్యాయి. వీటి విచారణలో ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఆస్ట్రాజెనెకా. వ్యాక్సిన్ గురించి పూర్తి సమాచారం తెలియకుండా యూకే ప్రభుత్వం సిఫారసు చేయడంతో ఇండియాలో కూడా చాలామంది కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అలాగే చాలా దేశాలకు ఈ వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. ఇన్నాళ్లు వ్యాక్సిన్ వల్లే ఇలా జరుగుతుందుమో అని అనుమానాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కన్ఫార్మ్ కావడంతో కోవీషిల్డ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న జనాలు, తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post