Covishield Effects : కరోనా నియంత్రణకి ప్రభుత్వం సిఫారసు చేసిన కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, మెదడులో రక్త స్రావం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒప్పుకుంది. ఈ వార్త ప్రపంచదేశాలను ఆందోళనల్లో పడేస్తోంది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కొద్దిమందిలో మాత్రమే అరుదుగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలియచేసింది ఆస్ట్రాజెనెకా…
తాజాగా 50 ఏళ్లు కూడా నిండకుండానే ప్రాణాలు కోల్పోయి పునీత్ రాజ్‌కుమార్ మరణానికి కూడా ఈ వ్యాక్సినే కారణమా? కరోనా కష్టకాలంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేశాడు పునీత్ రాజ్‌కుమార్. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందచేసిన పునీత్ రాజ్‌కుమార్, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కూడా జనాలకు సూచించాడు..
Covishield Side Effects : కోవీషిల్డ్ వ్యాక్సిన్ వల్లే ఆకస్మిక గుండెపోటు..
2021, ఏప్రిల్ 7న కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న పునీత్ రాజ్‌కుమార్, నెల రోజుల తర్వాత సెకండ్ డోస్ కూడా చేయించుకున్నాడు. ఈ సమయంలో 45 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తూ ట్వీట్ చేశాడు పునీత్ రాజ్‌కుమార్. ఇది జరిగిన కొన్ని రోజులకే 2021, అక్టోబర్ 29న కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.
2021, అక్టోబర్ 29న షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత గుండెలో కాస్త ఇబ్బందిగా ఉందని భార్య అశ్వినికి చెప్పిన పునీత్ రాజ్‌కుమార్, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పునీత్ మరణానికి గుండెపోటు కారణమని తెలియచేశారు వైద్యులు. దీంతో పునీత్ రాజ్‌కుమార్ మరణానికి కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు ఆయన అభిమానులు..