Chicken Pickle : తెలుగు వారికి పచ్చళ్లకు విడదీయరాని అనుబంధం. అందులోనూ నిల్వ పచ్చళ్లు అంటే ఎవరికీ ఇష్టముండదూ? చికెన్ పచ్చడి అంటే నాన్వెజ్ ప్రియులు మరింత ఇష్టంగా లాగించేస్తారు. ఈ నిల్వ చికెన్ పచ్చడిని ఏ విధంగా తయారో చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
* చికెన్ కేజీ
* వేరుశనగ నూనె 1/2 కేజీ
* అల్లం వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు
* కారం 100 గ్రాములు
* ఉప్పు 100 గ్రాములు
* మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
* నిమ్మకాయలు నాలుగు
* ధనియాలు , జీలకర్ర, యాలికలు, లవంగ మొక్క, దాల్చిన చెక్క, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ మొగ్గ ఒకటి, గసగసాలు ఒక టేబుల్ స్పూన్, ఇవన్నీ దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
Pimple Tips : మొటిమలు పోవడానికి సింపుల్ చిట్కాలు..
తయారీ విధానం :
ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసి, ఉప్పు పసుపు వేసి చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చికెన్ అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత నిల్వ ఉంటుంది. ఫ్రై అయిన చికెన్ తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, మెంతులు, ఆవాల పొడి వేసి అన్నీ కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత.. నిమ్మకాయల నుండి తీసిన రసాన్ని అందులో కలుపుకోవాలి. అంతే ఆరు నెలలు పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ అవుతుంది.