Cat Biryani in Chennai : మాధవన్, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘రన్’ సినిమాలో రూ.10లకు బిర్యానీ అని చెప్పి, కాకి బిర్యానీ అమ్మేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి మాఫియానే చెన్నైలో వెలుగు చూసింది.. కాకి కూడా కాకుండా ఏకంగా పిల్లి మాంసాన్ని, మటన్ బిర్యానీలో వాడుతున్నారట కొందరు కేటుగాళ్లు. చెన్నైలో కొన్ని పిల్లులను తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కుక్కలను తరలించడం కామన్ కానీ ఇన్ని పిల్లులను ఒక్కసారిగా తరలిస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..
కొంతమంది గ్యాంగ్ కలిసి వీధుల్లో సంచరించే పిల్లులను కిడ్నాప్ చేస్తున్నారు. వీటిని చంపేసి, మటన్ పేరుతో రోడ్ సైడ్ బిర్యానీ షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మేక, గొర్రె మాంసం స్థానంలో పిల్లి మాంసం వాడుతున్న విషయం కొందరు రోడ్ సైడ్ బిర్యానీ సెంటర్ల యజమానులకు తెలిసినా, వాళ్లు కూడా ఎక్కువ లాభం కోసం ఈ మాంసాన్ని వాడుతున్నారు.
Bryan Johnson : రోజుకి 100 మాత్రలు, వయసును తగ్గించుకోవడానికి ఏడాదికి రూ.17 కోట్లు..
చెన్నైలో చాలా ఏరియాల్లో ఈ పిల్లి బిర్యానీ సెంటర్లు ఉన్నాయని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో కొన్ని
మేక మాంసానికి బదులుగా కుక్క మాంసం వాడుతున్నారనే వార్త సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు చెన్నైలో ఈ పిల్లి బిర్యానీ బాగోతం తెలిసి, బిర్యానీ లవర్స్ షాక్ అవుతున్నారు.. కాబట్టి రూ.70-రూ.100కే ప్లేట్ బిర్యానీ అనగానే ఎగబడి తినేవాళ్లు, తాము తింటున్నది మటన్ బిర్యానీయో, పిల్లి మాంసం బిర్యానీయో ఓ నిమిషం ఆలోచించండి..