Bryan Johnson : పిచ్చి పలు విధములు. మరణమే లేకుండా భూమ్మీద శాశ్వతంగా ఉండిపోవాలని ఎందరో ప్రయత్నించారు. కానీ పుట్టిన ప్రతీ జీవి గిట్టక చావదని సృష్టి ధర్మం నిరూపిస్తూనే వస్తోంది. అయితే అమెరికాకి చెందిన 46 ఏళ్ల మిలియనీర్, ఎంటర్ప్రెన్యూర్ బ్రియాన్ జాన్సన్ మాత్రం తాను చావుని జయిస్తానని చెబుతున్నాడు..
వయసు పెరగకుండా ఉండేందుకు బ్రియాన్ జాన్సన్, రోజుకి 100 మాత్రలు మింగుతున్నాడట. అతని ఆరోగ్యం అనునిత్యం పరీక్షిస్తూ, రక్తం, కిడ్నీలు, గుండె, మెదడు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఏకంగా 30 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు.
Prithviraj Sukumaran : మెగాస్టార్ స్వయంగా అడిగినా చేయనని చెప్పేశా..
వయసు పెరగకుండా ఉండేందుకు వీళ్లు చెప్పిన తిండి మాత్రమే తింటున్నాడు జాన్సన్. సరిగ్గా రోజుకి 1977 కెలోరీలు ఉండే ఆహారం మాత్రమే తీసుకునే జాన్సన్, ఆల్కహాల్ తాగడు. మాంసాహారం తినడు. ఆఖరికి డెయిరీ ఉత్పత్తులు కూడా తీసుకోడు..
రోజూ ఉదయం నాలుగున్నరకి లేచి, రాత్రి ఎనిమిదిన్నరకి పడుకుంటాడు. అంతేకాదు బ్రియాన్ జాన్సన్ పడుకునే రూమ్లో బెడ్, అలారం తప్ప ఇంకేమీ ఉండవట. చావును ఆపడమే తన లక్ష్యమని చెప్పే జాన్సన్, ఇందుకోసం ఏడాదికి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.17 కోట్లు) ఖర్చు చేస్తున్నాడు.