Astrologer Venu Swamy : వైసీపీని భయపెడుతున్న వేణు స్వామి.. SRH ఓటమితో జగన్ ఓటమి ఖాయమేనా..

Astrologer Venu Swamy : ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2024 సీజన్‌కి ఎండ్ కార్డు పడింది. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఈ విజయంలో కెకెఆర్‌ ఖాతాలోకి మూడో ఐపిఎల్ టైటిల్ వచ్చి చేరింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓటమితో వైసీపీ కార్యకర్తల్లో భయం మొదలైంది. కారణం జ్యోతిష్య రత్న అని చెప్పుకునే వేణు స్వామి.

సెలబ్రిటీల జాతకాల గురించి నోటికి వచ్చింది వాగుతూ, తాను చెప్పిందే వేదం అన్నట్టుగా బిల్డప్స్ ఇస్తూ ఉంటాడు వేణు స్వామి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని బల్లగుద్ది చెప్పాడు వేణుస్వామి. అయితే కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పేరును భారత రాష్ట్ర సమితి అని మార్చడం వల్లే కేసీఆర్ జాతకంలో మార్పులు జరిగాయంటూ కప్పి పుచ్చుకున్నాడు.

Anant Ambani : ఒక పెళ్లికి రెండు ప్రీ వెడ్డింగ్ షూట్స్..

‘బాహుబలి’తోనే ప్రభాస్ పని అయిపోయిందంటూ కామెంట్ చేశాడు వేణుస్వామి. ‘సలార్’ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ తప్ప ఎవ్వరూ చూడలేదని, నష్టాలు వచ్చాయంటూ మరోసారి కామెంట్లు చేశాడు. ఇదే వేణు స్వామి, ఈసారి ఐపిఎల్ టైటిల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌దే అంటూ వ్యాఖ్యానించాడు. ‘కావ్య మారన్ జాతకంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్, కప్పు కొట్టి తీరుతుంది’ అంటూ జోస్యం చెప్పాడు వేణు స్వామి. అది కూడా తప్పు అని తేలిపోయింది.

‘ఈసారి జగన్, ఏపీలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు’ అంటూ వేణు స్వామి, కొన్ని నెలల క్రితం చెప్పాడు. వేణు స్వామి చెప్పినవన్నీ పక్కగా ఉల్టా అవుతుండడంతో ఈసారి జగన్ ఓటమి ఖాయమేనా అంటూ భయపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే పోలింగ్ శాతం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా పోల్ అయ్యాయంటూ వార్తలు రావడంతో వైసీపీలో భయం మొదలైంది. వేణు స్వామి జోస్యం ఆ భయాన్ని మరింత పెంచింది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post