AP Election 2024 : 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ తక్కువ జరిగింది. పోలింగ్ తర్వాత టీడీపీ ఓడిపోతుందని, వైసీపీకి భారీ మెజారిటీ దక్కనుందని తేలిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్‌కి ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడిందని వార్తలు వచ్చాయి. పోలింగ్‌కి ముందు అధికార పార్టీ, ప్రతిపక్షాలు రెండు పార్టీలు ఇచ్చే డబ్బు కోసమో జనం కొంత సైలెంట్ అవుతుంటారు. పోలింగ్ తర్వాత ఎవరికి ఓటు వేశారనే విషయంపై జనం ఓపెన్ అవుతుంటారు.. ఈ ఎన్నికల్లో మాత్రం ఎప్పుడు లేని విధంగా వివిధ సర్వే సంస్థలు సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉంది అని చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం 50% ఉంటే ఈ ఎన్నికల్లో మాత్రం 85% ఉందని సర్వే సంస్థలు అన్నీ లెక్కలు చెప్తున్నాయి.. ఈ సైలెంట్ ఓటింగ్ ఎటు అనే అంశం చూస్తే భయం ప్రధాన కారణం. జగన్ పథకాల పేరుతో ఇచ్చే డబ్బు ద్వారా లబ్ది పొందాం కాబట్టి జగన్‌కి ఓటు వేశామని చెప్పడానికి భయం అవసరం లేదు. కానీ జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ వర్గాల్లో ఉంది… కొన్ని వర్గాల్లో అయితే బానిసత్వం ఉంది.
Jagan Mohan Reddy: మరీ అద్వాన్నంగా మారిందా?
బానిసత్వం ఉన్నవాళ్ళు నిర్భయంగా తమ అభిప్రాయం బయటకు చెబుతారు. జగన్ పాలన, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని కూలిస్తే దిక్కు లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని అరెస్టు చేసినా దిక్కు లేదు.. ఎప్పుడు లేని విధంగా న్యాయమూర్తులను కూడా వదల్లేదు జగన్ సర్కార్. వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి మా జోలికొస్తే మాకు ఎవరైనా అంతే అనే సందేశం ప్రజల్లోకి పంపాడు జగన్.
సొంత చెల్లెలు జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడితే, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు వైసీపీ నాయకులు. అంటే జగన్ జోలికొస్తే సొంత చెల్లెలు అయినా సరే ఊరుకునేది లేదని తేలిపోయింది. చంద్రబాబు హయాంలో ఏపీలో ఉద్యమాలు జరిగినప్పుడు కూడా కేసులు పెట్టారు. అయితే ప్రత్యేక హోదా కోసం, రిజర్వేషన్లు కోసం ఉద్యమాలు జరగాయి. అరెస్టులు జరిగినా ఉద్యమాలు ఆగలేదు. కారణం ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నం, టీడీపీ సర్కార్ చేయలేదు.
అయితే వైసీపీ హయాంలో ఇలా జరగలేదు. చంద్రబాబు హయాంలో ఒక్క పద్మావతి మెడికల్ కాలేజీలో సీట్లు, నాన్ లోకల్ వివాదం చేస్తే ఉద్యమం చేశారు. కానీ ఇప్పుడు ప్రతి కొత్త మెడికల్ కాలేజీలో సగం సీట్లు పేదవారికి అందుబాటులో లేకుండా చేస్తే ఇదేమిటి అని అడిగేవారు లేరు.
Ap Elections : వైసీపీలో పెరుగుతున్న జింపింగ్ రాయుళ్లు! తెలంగాణలో జరిగినట్టే, ఏపీలో జరగనుందా…
అన్నమయ్య ప్రాజెక్టు ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయింది, ఫింఛా ప్రాజెక్టు మట్టి కట్ట కొట్టుకుపోయింది.. ఇలాంటివి చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఉద్యమ నేతలు పూనకంతో ఊగిపోయేవారు. కానీ జగన్ సర్కారులో ఇలా జరగలేదు. నోరెత్తితే ఏం చేస్తారోననే భయం? ఉద్యమం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే భయం జనాల్లో కనిపించింది. ఈ సైలెంట్ ఓటింగ్, వయోలెంట్ ఓటింగ్‌గా కూడా మారి ఉండొచ్చు. దీంతో జూన్ 4న ఏపీ ఎన్నికల రిజల్ట్ ఊహించని విధంగా రావొచ్చని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు..