Jagan Mohan Reddy: జగన్ పాలనలో పేదల పరిస్థితి మరీ అద్వాన్నంగా మారిందా?
పేదల పెన్నిదిగా పిలిపించుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ రెడ్డి (Jagan Mohan Reddy)కూడా సంక్షేమ పథకాల హామీలతోనే అధికారంలోకి వచ్చాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పాలన, వైఎస్ఆర్ పాలనలా అయితే సాగలేదు.
అధికారిక లెక్కల ప్రకారం ఏపీ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్య మొత్తం 1.6 కోట్లు. ప్రభుత్వ రంగాల్లో పని చేసే ఉద్యోగులతో పాటు 15 వేలు పైబడి ఆదాయం ఉన్న ఇతర రంగ ఉద్యోగులు పోగా రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 1.2 కోట్లు. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ దరిద్రరేఖ దిగువన బతుకుతున్నవారు కాదు..
దరిద్ర రేఖ దిగువన బతుకుతున్నవారికి సంక్షేమ పథకాల ద్వారా వచ్చే మొత్తం చాలా పెద్ద సాయం. అందుకే అలా సాయం చేసే నాయకుడిని దేవుడిలా చూస్తారు. అయితే జగన్ పాలనలో పేదలకు జరిగిన సంక్షేమం కంటే అన్యాయమే ఎక్కువని లెక్కలు చెబుతున్నారు..
మొదటి దెబ్బ ..
ఇసుక రద్దుతో భవన నిర్మాణ రంగ కార్మికులు పనిలేక కుదేలు అయ్యారు. ఇసుక ధరలు, భారీగా పెంచడం వల్ల నిర్మాణరంగం మొత్తం దెబ్బతింది… పనులు తక్కువ అయిపోయి ఆదాయానికి గండి పడింది…
రెండో దెబ్బ…
రివర్స్ టెండరింగ్ పనులు, ఎక్కువ మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబాలకే వెళ్లాయి. దీంతో నిర్మాణ రంగం ఐదేళ్లలో ఏ మాత్రం పుంజుకోలేదు… కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ కూలీలు పబ్బం గడపాల్సి వచ్చింది..
మూడో దెబ్బ..
విద్యుత్ ధరలు డైరెక్టుగా పెంచకుండా 50 యూనిట్లు నుంచి 30 యూనిట్లకు శ్లాబ్ మార్చారు. దీంతో విద్యుత్ ఛార్జీలు పేదవారికి భారంగా మారాయి…
నాలుగో దెబ్బ..
రేషన్ కార్డుదారులకు ఇచ్చే కందిపప్పు ధరలను పెంచారు. దీంతో కనీసం పప్పు వేసుకుని, అన్నం తిన్నాలన్నా జేబులో కాసుల లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐదో దెబ్బ..
ఇంటి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే 1.5 లక్షలను నగదు రూపంలో కాకుండా ఇసుక, సిమెంట్, ఇనుము రూపంలో ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వం, కేంద్రం ఇచ్చిన మొత్తానికి కొంత మొత్తం జత చేసి ఇంటి నిర్మాణం చేస్తోంది. అయితే ఏపీలో అలా జరగలేదు. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు కట్టుకోలేక పేదలు కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది.
ఆరో పెద్ద దెబ్బ..
కార్మికులు డ్రైవర్లు, వృత్తి పనులు చేసుకునేవారికి అలసట తీర్చుకునేందుకు మద్యం తాగే అలవాటు ఉంటుంది… వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వమే, మద్యం వ్యాపారం చేసింది. దేశంలో ఉన్న బ్రాండ్లను మొత్తం రద్దు చేసి నాసిరకం మద్యం అమ్మింది. దీంతో కనీసం నాణ్యమైన మద్యం తాగేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.
YS Jagan : జగన్‌కి ఓటమి తప్పదా? ఏపీలో పరిస్థితి ఎలా ఉంది..