Actor Suriya : విజయ్ రిజెక్ట్ కథతో మూడు సీక్వెల్స్ చేసిన సూర్య..

Actor Suriya : కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి… సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్టుగా ప్రకటించాడు. విజయ్ చేయబోయే ఆఖరి సినిమా గురించి రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ ఆఖరి సినిమా ఉండొచ్చని టాక్.. ఎక్కువగా మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసిన తెలుగు సినిమాలను తమిళ్‌లోకి రీమేక్ చేసి హిట్స్ కొట్టిన విజయ్.. 3 సీక్వెల్స్ వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాని రిజెక్ట్ చేశాడనే విషయం చాలామందికి తెలీదు.

Mahesh Babu PhonePe Ad: 5 సెకన్ల వాయిస్‌కి అన్నీ కోట్లా..! మహేష్ రేంజ్ చూస్తే మైండ్ బ్లాకే..

అదే సూర్య స్టార్‌డమ్‌ని డబుల్ చేసిన ‘సింగం’. తెలుగులో మొదటి పార్ట్ ‘యముడు’ పేరుతో విడుదలై, మంచి సక్సెస్ సాధించింది. తొలి పార్ట్ సక్సెస్ తర్వాత వచ్చిన ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు కూడా సూపర్ డూపర్ వసూళ్లు సాధించాయి. దీనికి నాలుగో సీక్వెల్ కూడా రాబోతోంది. కోలీవుడ్‌లో సూర్య చేసిన ఈ కథనే, బాలీవుడ్‌‌లో అజయ్ దేవగణ్ ‘సింగం’ పేరుతో రీమేక్ చేశాడు..

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ రాసుకున్న డైరెక్టర్ హరి, తొలుత విజయ్‌తోనే ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే స్క్రిప్ట్‌లో పెద్దగా మాస్ మసాలా, కామెడీ లేకపోవడంతో విజయ్ దీన్ని రిజెక్ట్ చేశాడట. అదే స్క్రిప్ట్ పట్టుకుని సూర్య దగ్గరికి వెళ్లడం, అతన్ని ఓకే చేసేయడం జరిగిపోయాయి. అనుష్క హీరోయిన్‌గా నటించిన ‘సింగం’ మూవీ రెండో పార్ట్‌లో హన్సిక, మూడో పార్ట్‌లో శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు..

Indore Beggar : 40 రోజులు అడుక్కుని రూ.2.5 లక్షల సంపాదన..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post