Tollywood Inside Facts : స్టార్ హీరోలతో సినిమా అంటే, ప్రాజెక్ట్ కన్ఫార్మ్ కాగానే అడ్వాన్స్ రూపంలో కోట్ల రూపాయల చెక్ ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు సినిమా సగం కాకముందే మొత్తం రెమ్యూనరేషన్ ముట్టచెప్పాల్సి ఉంటుంది. స్టార్ హీరోలతో, హీరోయిన్లతో ఫ్యూచర్లో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు, రెమ్యూనరేషన్ విషయంలో లేటు చేయకుండా జాగ్రత్త పడతారు. అయితే సినిమా అంటే ఇష్టంతో పొట్టకూటి కోసం పని చేసే ఆర్టిస్టుల విషయంలో మాత్రం ఇది మరోలా ఉంటోంది.
టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే ప్రొడక్షన్ సంస్థల్లో ఒక్కటైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) కొన్ని నెలలుగా ఆర్టిస్టులతో పేమెంట్స్ ఇవ్వకుండా ఫ్రీగా పనిచేయించుకుంటుందట.. 2016లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘రన్’ సినిమాతో మొదలైన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ‘విరాట పర్వం’, ‘పడి పడి లేచే మనసు’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు వచ్చాయి. గత ఏడాది నానితో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ దక్కింది. అలాగే నాగశౌర్యతో తీసిన ‘రంగబలి’ మూవీ కూడా బాగానే ఆడింది.
Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?
నిర్మాత సుధాకర్ చెరుకూరి, వ్యాపారంలో పక్కాగా ఉంటూ ఆర్టిస్టుల పొట్టకొడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటిదాకా ఈ బ్యానర్‌కి పనిచేసిన ఆర్టిస్టులకు చాలా మందికి పేమెంట్లు అందలేదట. మేనేజర్‌కి ఫోన్ చేసి, పేమెంట్ విషయం గురించి అడిగితే ఆ రోజు, ఈరోజు అంటూ కొన్ని నెలలుగా తిప్పించుకుంటున్నారు.
‘దసరా మూవీ కోసం కృష్ణానగర్ నుంచి గోదావరిఖనికి 23 మందిని తీసుకొచ్చాను. వారం పాటు అక్కడి లొకేషన్స్‌లో పనిచేశాం. ఆ సినిమా విడుదలై బాగా ఆడింది కూడా. కానీ ఇప్పటిదాకా మాకు పేమెంట్స్ ఇవ్వలేదు. వాళ్ల ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చుల కోసం నేను రూ.70 వేలు ఖర్చు పెట్టాను. మేకర్స్ మాత్రం ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. పని కాకముందు ఒకలా మాట్లాడుతూ, పని కాగానే మాట మారుస్తారు.. ’ అంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ శ్రీను కామెంట్ చేశాడు..
Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..
ప్రస్తుతం ‘దసరా’ కాంబో నాని- శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కనుంది. అలాగే KJO అనే మరో సినిమా కూడా అనౌన్స్ చేసింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పేమెంట్ విషయంలో SLVC ఎలా స్పందిస్తుందో చూడాలి..