రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65..

How to Make Chicken 65 in Telugu : సండే వచ్చిందంటే.. చాలా మందికి ముక్క లేనిది.. ముద్ద దిగదంటారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉండే నాన్​వెజ్..​ చికెన్​. చికెన్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. వాటిలో చికెన్ 65 స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. ఈ చికెన్ 65 ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. రెస్టారెంట్​ స్టైల్​లో రుచికరమైన చికెన్-65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం..

అరటి దూట పెసరపప్పు..

కావాల్సిన పదార్థాలు :

చికెన్ – 1/4 కిలో (బోన్ లెస్ చిన్నచిన్న ముక్కలు)
పచ్చి మిరపకాయలు – 5 (చీల్చినవి)
జీలకర్ర – అర చెంచా
కొత్తిమీర – తరిగినది
కోడి గుడ్డు – 1
కారం – అర చెంచా
ఉప్పు – అర చెంచా
కరివేపాకు – తరిగినది
అల్లం – అర చెంచా (తరిగిన చిన్నచిన్న ముక్కలు)
వెల్లుల్లి – ఒక చెంచా (తరిగిన చిన్నచిన్న ముక్కలు )
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాలు
కార్న్ ఫ్లోర్ – రెండు చెంచాలు
రెడ్ చిల్లి గార్లిక్ పేస్ట్ – ఒక చెంచా
అజనోమోటో – అర చెంచా
ఆయిల్ – ప్రై చేసుకోవడానికి సరిపడా
జీలకర్ర పొడి – అర చెంచా
మిరియలపొడి – అర చెంచా
రంగు – 2 చుక్కలు (రంగు కావాలి అనుకుంటే మాత్రమే)

తయారీ విధానం :
ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని అందులో సాల్ట్, అజోనోమోటో, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, కార్న్ ఫ్లోర్, వేసి కలపాలి. తరువాత ఎగ్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేపుకోవాలి (డీప్ ప్రై).

అల్లోపతి V/S ఆయుర్వేదం..

వేరే పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి అర చెంచా జీలకర్ర, అర చెంచా అల్లం, ఒక చెంచా వెల్లుల్లి ముక్కలు వేసి కొంచెం వేగాక అందులో పచ్చి మిర్చి ముక్కలు, కరివె పాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ (అవసరం లేని వారు వేసుకోక పోయినా పరవాలేదు) వేసి కలిపి, కొంచెం పెప్పేర్ పౌడర్, అర చెంచా జీలకర్ర పౌడర్, అర చెంచా కారం, కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, కొంచెం అజోనోమోటో వేసి కలిపి (రంగు కావాలి అనుకుంటే రెడ్ కలర్ వేసి ) కొంచెం నీరు వేసి కలిపి ముందుగా వేయించిన చికెన్ ముక్కలు వేసి వేపు కోవాలి. అంతే చికెన్-65 రెడీ..

దీని పైన కొత్తిమీర వేసి వేడి వేడిగా తినేయడమే తరువాయి.. కావాలంటే లాస్ట్ లో నిమ్మ రసం పిండుకోవొచ్చు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post