Payal Ghosh allegations on Irfan Pathan, Gautam Gambhir : కొన్నిసార్లు ‘ప్రయాణం’ ఎప్పటికీ ఆగదు. ఇప్పుడు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ‘క్యాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్… ‘ఊసరవెళ్లి’లా రంగులు మారుస్తూనే ఉంది.
ప్రపంచ కప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడినా తక్కువేమీ కాదు..
వరల్డ్ కప్ సమయంలో అద్భుతమైన బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన మహ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకోవాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసింది పాయల్ ఘోష్. తాజాగా మరోసారి అటెన్షన్ కోసం క్రికెటర్లను టార్గెట్ చేస్తోంది నటి పాయల్ ఘోష్.
‘ఇర్ఫాన్ పఠాన్‌ని ప్రేమించానని, అతనితో బ్రేకప్ తర్వాత మరే వ్యక్తిని తన జీవితంలోకి రానివ్వలేదని’ వ్యాఖ్యానించింది పాయల్ ఘోష్. అంతటితో ఆగకుండా ఇర్ఫాన్ పఠాన్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్, వరుసగా మిస్డ్ కాల్స్ ఇస్తూ విసిగించేవాడంటూ కామెంట్ చేసింది పాయల్ ఘోష్.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
ఇర్ఫాన్ పఠాన్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పాయల్ ఘోష్, గౌతమ్ గంభీర్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. మంచు మనోజ్‌తో ‘ప్రయాణం’ మూవీ చేసిన పాయల్ ఘోష్, ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’ మూవీలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్‌గా నటించింది.