Anant Ambani wedding Cost : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ పెళ్లిలో అనంత్ అంబానీ ధరించిన డ్రెస్సు ఇంత, రాధికా వేసుకున్న నెక్లెస్ ఖర్చు ఇంత అని లెక్కలు కట్టారు నెటిజన్లు.. పెళ్లి తంతు ముగిసింది. ఈ పెళ్లికి అయిన మొత్తం ఖర్చు లెక్క తేలింది.. అంబానీ ఇంట్లో పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యిందట..
ఈ వివాహ వేడుక కోసం స్పెషల్‌గా శుభలేఖను డిజైన్ చేయించారు. ఒక్కో శుభలేఖ కోసం రూ.9 లక్షల వరకూ ఖర్చు చేసిందట అంబానీ ఫ్యామిలీ.. ఇలా కేవలం పెళ్లి పత్రికల కోసం రూ.200 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు సమాచారం.. ఇందులో రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్సలు, నగల కోసమే రూ.1500 కోట్ల వరకూ ఖర్చు చేశారట..
సెలబ్రిటీల కోసం, సెలబ్రిటీలతో అనంత్ అంబానీ పెళ్లి గురించి పోస్టులు చేయించేందుకు మరో రూ.1000 కోట్లు ఖర్చు చేశారట.. ఇంత చేసి, పెళ్లి కోసం ఖర్చు చేసిన మొత్తం అంబానీ ఆస్తిలో కేవలం 2 శాతం మాత్రమే..